విజయవాడ

‘పశ్చిమ’ పీఠం వెలంపల్లిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, మే 23: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి వెంలపల్లి శ్రీనివాసరావు విజయకేతనం ఎగురవేశారు. ఐదేళ్ల ఎదురుచూపులు ఫలించాయి. పశ్చిమ ఓటర్లు మండువేసవిలో మామిడిపండు లాంటి పదవిని వెలంపల్లికి అప్పగించారు. గురువారం గంగూరులోని ధనేకుల ఇంజనీరింగ్ కాలేజీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఎన్నికల అధికారులు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలలో నిక్షిప్తమైన ఎన్నికల ఫలితాలను అధికారులు ప్రకటించారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి వరకు కొనసాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో నియోజకవర్గంలో మొత్తం 20 రౌండ్ల కౌంటింగ్ జరిగింది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు కౌంటింగ్ ఆ తరువాత ఈవీఎంల లెక్కింపు జరిగాయి. ఎంతో ఆశగా 42 రోజుల పాటు ఎదురుచూసిన ఎన్నికల ఫలితాలు వైకాపా పవనంతో ఏకపక్షం కాగా పశ్చిమంలో వెలంపల్లి శ్రీనివాసరావు 20 రౌండ్లు పూర్తయ్యే సమయానికి 8456 ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని షబానా ఖాతూన్ పై విజయం సాధించారు. అభివృద్ధి పనులే ఓట్లు వేయిస్తాయని ధీమా వ్యక్తం చేసి తన కుమార్తె షబానా ఖాతూన్‌ని రంగంలో దించిన జలీల్‌ఖాన్ భంగపాటుకు గురయ్యారు. ఎన్నో ఆశలతో అమెరికా నుండి వచ్చిన షబానా ఆశలు నిరాశలయ్యాయి. వెలంపల్లికి 58,126 ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ల ద్వారా 94, సర్వీసు ఓట్లు 6 వచ్చాయి. షబానా ఖాతూన్‌కు మొత్తం 50670 ఓట్లు పోలయ్యాయ. జనసేన అభ్యర్థి పోతిన మహేష్‌కి 23,012 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ల ద్వారా 84, సర్వీసు ఓట్లు 2 వచ్చాయి. పశ్చిమంలో నాలుగు స్తంభాలాట లాగా వైకాపా, తెదే, జనసేన, స్వతంత్ర అభ్యర్థి కోరాడ విజయకుమార్‌ల మధ్య జరిగిన ఈ ఎన్నికల పోటీలో నలుగురు అభ్యర్థులూ తామే గెలుస్తామనే ధీమాతో ఉండగా గురువారం ప్రజల తీర్పుతో ఉత్కంఠతకు తెరపడింది. స్వతంత్ర అభ్యర్థి కోరాడ విజయకుమార్‌కి 12,812 ఓట్లు, బీజేపీ అభ్యర్థి పీయూష్ దేశాయ్‌కి 4195 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మట్టా జోబ్త్న్రకుమార్‌కి కేవలం 2259 ఓట్లు మాత్రమే వచ్చాయి. పశ్చిమంలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలుపుకుని స్వతంత్ర, పలు పార్టీల అభ్యర్థులు మొత్తం 24 మంది ఎన్నికల బరిలోకి దిగారు. లక్షా, 53వేల, 133 ఓట్లు పోలయ్యాయి. వెలంపల్లి కౌంటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుండి రౌండు రౌండుకూ తమ ఆధిక్యతన చాటుకుంటూ చివరకు విజేతగా నిలిచారు. పందెం రాయిళ్లకు ఈ ఎన్నికలు గుణపాఠం చెప్పినట్లైయింది. లక్షలాది రూపాయలు పెందెలు కాసిన వారు ఖంగుతిన్నారు. వృద్ధుల పింఛన్‌లు, డ్వాక్రా మహిళల పసుపు కుంకుమ తాయిలాలు పని చేయలేదు. కాగా పశ్చిమ సీటు దక్కించుకున్న వెలంపల్లికి వైశ్యుల కోటాలో మంత్రి పదవి వరిస్తుందని మాజీ సీఎం కొణిజేటి రోశయ్య తమ వంతు మాట సాయం అందిస్తారని పశ్చిమంలో ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే సుమారు 25 సంవత్సరాల క్రితం పశ్చిమం నుండి ఎంకే బేగ్ మంత్రి కాగా నేడు వెలంపల్లి పశ్చిమానికి ప్రత్యేక గుర్తింపు తేవడం ఖాయమని ఆయన వర్గీయులు చెబుతున్నారు.