విజయవాడ

సెంట్రల్‌లో తేలిన ఓట్ల లెక్క 25 ఓట్లతో విష్ణు గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 24: సెంట్రల్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు లెక్క తేలింది. గురువారం ఉదయం ప్రాంరభమైన లెక్కింపు అర్ధరాత్రి వరకూ కొనసాగగా, తదుపరి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విష్ణు గెలిచినట్టు ప్రకటించినా, మెజార్టీ మాత్రం అధికారులు చెప్పలేకపోయిన వైనం గమనార్హం. కాగా ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ రేపిన సెంట్రల్ లెక్కింపు చివరికి 25ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్టు అధికారికంగా ప్రకటించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. రెండు ఈవీఎంలలో తలెత్తిన సాంకేతిక లోపాలు అధికారులను, అభ్యర్థులను చికాకు పెట్టగా, నియోజకవర్గంలో మాత్రం ఇరుపార్టీలోనూ తీవ్ర ఉత్కంఠ రేపింది. ఒక దశలో టీడీపీ అభ్యర్థి బొండ ఉమా 36 ఓట్లతో విజయం సాధించినట్టు మీడియాలో వెలువడగా, సంబరాలకు సమాయత్తమైన శ్రేణులు ఆ సంబరాలు ముగిసే లోపు మళ్లీ వైకాపా అభ్యర్థి మల్లాది విష్ణు గెలిచినట్టు ప్రకటించాల్సి వచ్చింది. తర్జన భర్జన అనంతరం కొలిక్కి వచ్చిన లెక్కింపుతో మల్లాది విష్ణు తన సమీప అభ్యర్థి బొండ ఉమాపై 25ఓట్లతో గెలుపొందినట్టు గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత అధికారిక ప్రకటన వెలువడటంతో విష్ణు విజేతగా నిర్థారణ కావడంతో వైసీపీ శ్రేణులో ఆనందాలకు అవధుల్లేవనే చెప్పాలి.
సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2లక్షల 69వేల 859 ఓటర్లు ఉండగా, లక్షా 77వేల 516 ఓట్లు పోల్ అయ్యాయి. ఎన్నికల బరిలో మొత్తం 18 మంది అభ్యర్థులు పోటీ చేయగా, ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల మధ్యే పోటీ నిలిచింది. వీరిలో జనసేన బలపర్చిన సీపీఎం అభ్యర్థి సీహెచ్ బాబూరావు, వైకాపా అభ్యర్థి మల్లాది విష్ణు, టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు మధ్యే ఓట్ల పంపకాలు జరుగగా, మిగిలిన అభ్యర్థులు నామమాత్రంగానే మిగిలారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వీ గురునాథం కేవలం 2వేల 53 ఓట్లు, బీజేపీ తరఫున పోటీ చేసిన వీ సత్యమూర్తి 2567 ఓట్లను మాత్రమే సాధించగలిగారు. అలాగే సీపీఎం అభ్యర్థి సీహెచ్ బాబూరావు 29వేల 333 ఓట్లు సాధించారు. ప్రదాన పోటీదారులుగా నిలిచిన టీడీపీ అభ్యర్థి బొండా ఉమా, వైపాకా అభ్యర్థి మల్లాది విష్ణు మధ్యే నువ్వా నేనా అన్నట్టుగా పోటీలో నిలవగా ఈవీఎంలు, పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపు అనంతరం 25ఓట్ల మెజార్టీతో విష్ణు గెలుపొందినట్టు నిర్థారణ అయింది. ఉమాకు ఈవీఎంల ద్వారా 70వేల 552, పోస్టల్ ద్వారా 144 ఓట్లు కలిపి మొత్తం 70వేల 696 ఓట్లు రాగా, వైకాపా అభ్యర్థి విష్ణుకు ఈవీఎంల ద్వారా 70351, పోస్టల్ ద్వారా 370, మొత్తం కలిపి 70721 ఓట్లు సాధించి విజయబావుటా ఎగురవేశారు. టీడీపీ, వైకాపాల మధ్య కేవలం .02శాతం ఓట్లు మాత్రమే తేడా ఉంది. ఉమాకు 39.71శాతం ఓట్లు పోల్ అవ్వగా, విష్ణుకు 39.73శాతం పోల్ అయినాయి.

అయ్యో.. బొండా!
నాడు అత్యధిక మెజార్టీతో విజయం
నేడు స్వల్ప తేడాతో ఓటమి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 24: రాజకీయాల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం. 2014లో జరిగిన ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరపున పోటీ చేసిన బొండా ఉమమహేశ్వరరావు జిల్లాలోని ఇతర 15 నియోజకవర్గల్లో గెలుపొందిన అభ్యర్థుల కంటే ఎక్కువగా 27వేల 161 ఓట్ల భారీ ఆధిక్యతతో వైకాపా అభ్యర్థి గౌతమ్‌రెడ్డిపై గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో కేవలం 25 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. జిల్లాలో ఇంత అంతతక్కువ తేడాతో మరెవరూ ఓటమి కాలేదు. భారీ తేడా అయితే బాధ ఉండేది కాదు. అతి తక్కువ తేడా కావటంతో ఆ తేడా దేనివల్ల వచ్చింది. ఏ వీధిలో ఎవరెవరూ తమకు ఓట్లు వేయలేదోనని బొండా అనుచరులు ఆరాతీస్తున్నారు.

వస్తున్నా.. ప్రెస్‌మీట్ పెడుతున్నా!
* రేపు నగరానికి రామ్‌గోపాల్ వర్మ
* ట్విటర్ వేదికగా చంద్రబాబుకు సవాల్
విజయవాడ (క్రైం), మే 24: రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసిన చంద్రబాబు నాయుడుకి సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్విటర్ వేదికగా సవాల్ విసిరారు. ‘ఎక్కడయితే మాజీ సీఎం నన్ను అరెస్టు చేయించి నగరం నుంచి వెళ్లగొట్టారో అదే సింగ్‌నగర్ పైపులరోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎల్లుండి (ఆదివారం) సాయంత్రం 4గంటలకు ప్రెస్‌మీట్ పెట్టబోతున్నామని బస్తీమే సవాల్.. ఎన్టీఆర్ నిజమైన అభిమానులకు ఇదే నా బహిరంగ ఆహ్వానం.. జై జగన్’ అంటూ వర్మ ట్విటర్ ద్వారా సవాల్ విసిరారు. ఇప్పటికే వైఎస్ జగన్ చరిత్రాత్మక విక్టరీపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ పాటను విడుదల చేశారు. ఇటీవల ఆయన తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ‘విజయం విజయం ఘన విజయం’ పాటకు వైఎస్సార్ సీపీ సంబరాలు, జగన్ పాదయాత్ర విజువల్స్‌ను జోడించి పాటను రూపొందించారు. ఈ పాటకు చంద్రబాబుపై జగన్ గ్రాండ్ విక్టరీ ఇది దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రివేంజ్’ అంటూ క్యాప్షన్‌గా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రాష్ట్రంలో ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీడీపీ, చంద్రాబాబుపై వరుస ట్వీట్లతో వర్మ వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. నిన్న రాత్రి స్వర్గీయ ఎన్టీఆర్ నా కలలోకి వచ్చి లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల ఆపినందుకే చంద్రబాబును దారుణంగా ఓడిపోయేలా చేశానని చెప్పారు’ అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో ఈ వేసవికాలంలో ఏపీలో చాలా స్ట్రోక్స్ వచ్చాయని, కాని ఒకే ఒక స్ట్రోక్‌కు టీడీపీ విలవిలలాడిందన్నారు. ఇలా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ వర్మ మాజీ సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేస్తున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రాష్ట్రంలో ప్రదర్శించకుండా నిలుపుదల చేయడం, అదేవిధంగా నగరానికి వచ్చి విలేఖరుల సమావేశంలో ఏర్పాటు చేసేందుకు వెళ్తున్న వర్మను అడ్డుకున్న పోలీసులు విమానాశ్రయంలో నిర్బంధించి వెనక్కు తిప్పి పంపేయడం వంటి పరిణామాలను మనసులో పెట్టుకున్న వర్మ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగానే ఈనెల 26న ఆదివారం విజయవాడ వస్తున్నా.. ప్రెస్‌మీట్ పెడుతున్నా అంటూ చంద్రబాబుకు సవాల్ విసరడంతో ప్రస్తుతం అటు రాజకీయ వర్గాల్లోనూ.. ఇటు పోలీసువర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

26న కందుకూరి వీరేశలింగం
శత వర్ధంతి సమాలోచన
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 24: నగరంలోని 100 సాహిత్య, సామాజిక, కళాసాంస్కృతిక సంస్థలు కల్సి ఏర్పాటైన కందుకూరి వీరేశలింగం శత వర్ధంతి సమాలోచన నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఆయన 100వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిటీ కన్వీనర్ సీ ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26న మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో సదస్సు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సమాలోచన, సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు, పుస్తక ప్రదర్శన, చార్ట్స్ ఎగ్జిబిషన్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 10 నుండి 11.30 గంటలకు వరకు ప్రారం భ సభ జరుగుతుందని తెలిపారు. ప్రముఖ రాజకీయ విశే్లషకులు, రచయిత తెలకపల్లి రవి అధ్యక్షతన జరిగే ఈ సభలో వకుళాభవరణం రామకృష్ణ ప్రారంభోపన్యాసం చేస్తారని, విశిష్ట అతిథిగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం విశిష్ట అతిథిగా, గౌరవ అతిథులుగా జీ విజ యం, దీర్ఘాసి విజయభాస్కర్, కేఎస్ లక్ష్మణరావు, కత్తి పద్మారావు, మనసు ఫౌండేషన్ రాయుడు, డాక్టర్ హేమా పరిమి పాల్గొంటారని తెలిపారు. ఉదయం 11.30 నుండి 1 గంట వరకు కందుకూరి వీరేశలింగం - తెలుగు సాహిత్యంపై సదస్సు జరగుతుంది. పాపినేని శివశంకర్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో వక్తలుగా రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, మేడిపల్లి రవికుమార్, గుంటూరు లక్ష్మీనరసయ్య పాల్గొంటారు. ఒంటి గంట నుండి 1.30 వరకు దేవేంద్ర రచించిన సంస్కరణోద్యమ ఖడ్గదారి కందుకూరి రూపకం ప్రదర్శన ఉంటుంది. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు కందుకూరి వీరేశలింగం - సంఘ సంస్కరణ ఉద్యమాలపై సమాలోచన ఉంటుంది. ఎస్ అంజయ్య అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో వక్తలుగా కడియాల రామమోహన్ రాయ్, కొత్తపల్లి రవిబాబు, చూపు కాత్యాయని, వి బాలసుబ్రహ్మణ్యం పాల్గొంటారు. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు సంఘ సంస్కరణ ఉద్యమాలు - వర్తమాన సమాజంపై జరిగే సమాలోచనకు డాక్టర్ జి సమరయం అధ్యక్షత వహిస్తారు. వక్తలుగా పుణ్యవతి, ఎంవిఎస్ శర్మ పెనుగొండ లక్ష్మీనారాయణ, కొలకలూరి ఆశాజ్యోతి, శిఖామణి పాల్గొంటారు.

కంకి 1 సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్
ప్రజలకు అందుబాటులో ఉంటా
కంకిపాడు,మే 24: గెలిచినా, ఓడినా నియోజవర్గంలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని పెనమలూరు నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ గడచిన ఐదేళ్లలో నిత్యం నియోజకవర్గం అభివృద్ధికి నావెంట ఉండి ప్రతి కార్యక్రమానికి అండగా ఉన్న టీడీపీ కార్యకర్తలకు కృతజ్జతలు తెలిపారు. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు, ఓటమి సహజమే కానీ అణునిత్యం ప్రజల్లో ఉండి ప్రజాసేవే ధ్యేయంగా పనిచేసినా ఓడిపోవటం అసంతృప్తిగా ఉందన్నారు. సొంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు చేశానని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కోట్లాది రూపాయలు నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశానన్నారు. అయినా ఇంకా ప్రజలకు ఏమి కావాలో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎందుకు ఓటు వేయలేదో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. గతంలో కంటే ఎక్కువ ఉత్సాహంతో నిత్యం అందుబాటులో ఉండి తిరిగి టీడీపీని బలోపేతం చేస్తామన్నారు. ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అనే్న రామారావు, బీ శివరామకృష్ణ, వణుకురి విక్రమ్, స్టాలిన్, డీ నాగేశ్వరరావు, పులి కామేశ్వరరావు, ఏనుగు జయప్రకాష్, శ్రీకాంత్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర మంత్రివర్గంలో
కాపులకు ప్రాధాన్యతనివ్వాలి
* కాపునాడు వినతి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 24: గతంలో ముందెన్నడూ లేనివిధంగా అత్యంత మెజార్టీ స్థానాలతో వైకాపా విజయం దుందుభి మోగించటం పట్ల కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామమోహనరావు ఒక ప్రకటనలో హర్షం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. జనసేన పోటీలో ఉన్నప్పటికీ కాపు సోదరులు అత్యధిక మంది ఈదఫా జగన్‌కి సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు. మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని వెంకటరామయ్య (నాని), అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఇతర శాసనసభ్యులు అందరికీ ఆంధ్రప్రదేశ్ కాపునాడు తరుపున అభినందనలు తెలియజేశారు. కాపు కార్పొరేషన్‌కి భారీ నిధులను కేటాయించి కాపులను అన్ని విధాలుగా ఆదుకోగలరని విశ్వాసం తమలో ఉందన్నారు. ఆనాడు దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి కాపులు తమ మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించారని ఆదేవిధంగా జగన్‌మోహన్‌రెడ్డి కాపులకు తమ మంత్రివర్గంలో ఎక్కువమందికి సముచిత స్థానం కల్పించి, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా, స్పీకర్‌గా కాపులకు అవకాశం కల్పించగలరని ఆయన కోరారు. ఈ సందర్భంగా బేతు రామమోహనరావు, దాసరి కిరణ్‌కుమార్ కలసి మచిలీపట్నం ఎంపీగా విజయం సాధించిన వల్లభనేని బాలశౌరిని గజమాలతో ఘనంగా సత్కరించి, కేక్ కటింగ్ చేయించారు. ఈ కార్యక్రమంలో కాపునాడు నాయకులు హనుమకొండ కృష్ణ, విన్నకోట సురేష్, కోసూరి నాగ వెంకట శ్రీనివాసరావు, నాగరాజు, ఈమని సురేష్, ముత్యాల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

27న ఏపీఎన్‌జీవో నగర శాఖ కార్యవర్గ సమావేశం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 24: ఏపీఎన్‌జీవో అసోసియేషన్ నగర శాఖ కార్యవ