విజయవాడ

శరవేగంగా అర్జున వీధి విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జూలై 22: కృష్ణా పుష్కరాల మహోత్సవాలు, దుర్గగుడి అభివృద్ధి పనులు, అర్జున వీధి 100 అడుగుల విస్తరణ పేర్లతో మల్లిఖార్జున పేటలో చేపట్టిన అభివృద్ధి పనులు మరింతగా వేగం పుంజుకున్నాయి. సయ్యద్ దర్గా నుండి శ్రీ మల్లిఖార్జున మహామండపం, ఇదేవిధంగా శ్రీమల్లేశ్వరస్వామి ఆలయం మెట్ల వరకు అర్జునవీధిని 100 అడుగుల మేరకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో ఇక్కడ రోడ్ విస్తరణ పనులు ప్రారంభమైయ్యాయి. శ్రీ మల్లిఖార్జున మహామండపం చుట్టు పక్కన ఉన్న ఇళ్లు, శంకరమఠం, గోశాల, అక్కన్న, మాదన్న గృహాలు తొలగించి స్థలాన్ని సేకరించారు. ఇదేవిధంగా శ్రీ మల్లిఖార్జునస్వామి మెట్ల వద్ద ఇళ్లు, ఈసెంటర్‌లో ఉన్న మరికొన్ని ఇళ్లను తొలగించటంతో సుమారు 2ఎకరాల స్థలం దేవస్థానానికి లభించింది. సేకరించిన స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు సిబ్బంది నిరంతరం పనులు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కలెక్టర్ చేస్తున్న పనులను పర్యవేక్షించి ఈపనులు మరింత వేగవంతంగా చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో కనకదుర్గనగర్ పక్కనే ఉన్న అక్కన్న, మాదన్న గృహాలు నుండి సేకరించిన స్థలాన్ని వినియోగంలోనికి తీసుకువచ్చేందుకు సిబ్బంది పనులను చాలా వేగంగా చేస్తున్నారు. ఇదేవిధంగా మల్లిఖార్జునస్వామి మెట్ల వద్ద తొలగించిన ఇళ్లకు చెందిన స్థలాన్ని కూడా రోడ్‌గా మార్చేందుకు సిబ్బంది పనులు చేపట్టారు.