విజయవాడ

స్పీడందుకున్న ఆర్టీసీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 22: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ట్రాక్ మార్చింది. హైటెక్ కాలంలో పాత పద్ధతులకు స్వస్తి పలుకుతోంది. జనంలో నిలబడాలంటే హైటెక్ మంత్రాన్ని జపించక తప్పదన్న భావనతో ఆర్టీసీ యాజమాన్యం ఇప్పుడు దూసుకుపోతోంది. అందుకు అధునాతన పద్ధతులే మేలని వాటిని అనుసరిస్తుంది. ఆధునిక బస్సులను ప్రవేశపెడుతూ ఆర్టీసీ కొత్తగా ప్రయాణిస్తోంది. ఆర్‌టిసి ఎండి, వైస్ చైర్మన్‌గా నండూరి సాంబశివరావు బాధ్యతలు చేపట్టిన గత కొద్ది మాసాల్లోనే ఆర్‌టిసి రూ పురేఖలే మారిపోయాయి. ప్రయాణికులను పెద్దఎత్తున ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. కార్పోరేట్ శైలిలో దాదాపు 100 బస్టాండ్లను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దింది. బస్టాండుల్లో ప్రయాణికులకు సౌకర్యవంతంగా సీటింగ్ సదుపాయాన్ని కల్పించింది. ప్రయాణికులకు బస్సు ఎక్కడ ఉందన్న విషయం అర్ధమయ్యేలా ఇ-ట్రాకింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇటీవలే విజయవాడలో ప్రయోగాత్మకంగా సిటీ బస్సు ట్రాకింగ్ సదుపాయాన్ని కల్పించారు. రూట్ నెంబర్ ఎంటర్ చేస్తే బస్సు ఎక్కడుందో తెలిసిపోతుంది. ప్రయాణికులకు బస్టాండ్లలో వసతి సౌకర్యాన్ని మెరుగు చేయడంతోపాటు తక్కువ ధరకే టాయ్‌లెట్లు, రిఫ్రష్మెంట్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చింది.
ప్రైవేటుకు ధీటుగా హైటెక్ పోకడ
ప్రైవేట్ ఆపరేటర్ల దూకుడుకు డబుల్ దూకుడు ప్రదర్శించేలా ఆర్టీసీ యజమాన్యం చర్యలు తీసుకుంటోంది. ఆర్టీసీ బస్సులంటే డొక్కు బస్సులు, కాలం చెల్లిన వాహనాలు కాదు.. హైటెక్ అన్న అభిప్రాయాన్ని బలంగా కలిగించడంలో ఆర్టీసీ ముందుంటుంది.
ఆర్టీసీ బస్సులు గతంతో పోల్చుకుంటే ప్రయాణ వేగాన్ని బాగా పెంచాయి. గతంలో విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకునేందుడు ఆరేడు గంటలు పడితే ఇప్పుడు ప్రయాణాన్ని గంట మేరకు తగ్గించాయి.
రెండు శాతం పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో
గత ఏడాది 68 శాతంగా వున్న ఓఆర్ (ఆక్యుపెన్సీ రేషియా) ఇప్పుడు 70 శాతానికి చేరింది. ప్రయాణికులను ఆకట్టుకోడానికి కొత్త స్కీములతో కార్యాచరణ సిద్ధం చేసింది. బస్సు ఖాళీగా వెళ్లకూడదన్న మేనేజ్‌మెంట్ సిద్ధాంతాన్ని క్షేత్రస్థాయిలో నిజం చేసి చూపిస్తున్నారు ఆర్టీసీ సిబ్బంది. రోజురోజుకు ఆక్యుపెన్సీ రేషియోను పెంచుతోంది. ఇప్పటికే ఉన్న అనేక ఆర్టీసీ స్కీములకు కొత్తవాటిని జోడించి మరింత ఆదాయాన్ని రాబట్టుకునే ప్రణాళికలు రూపొందిస్తోంది.
త్వరలో లైవ్ టివి ప్రసారాలు
అల్ట్రా సూపర్ లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సుల్లో వీడియో కోచ్‌ల ద్వారా ప్రయాణికులకు వినోదాన్ని అందిస్తోంది. ప్రయోగాత్మకంగా అమరావతి బస్సుల్లో లైవ్ టీవి సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ఈ సౌకర్యాన్ని వీలైనన్ని ఎక్కువ బస్సులకు అందించనున్నారు. విజయవాడ బస్టాండ్‌లో మినీ ధియేటర్లు ఏర్పాటు చేసింది. ప్రధాన పట్టణాల్లో మినీ ధియేటర్లు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఆర్టీసీ స్థలాలను స్విస్ ఛాలెంజ్ పద్ధతిన లీజుకు ఇవ్వడం ద్వారా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచాలని నిర్ణయించారు.
తగ్గిన నష్టాలు
ఎప్పుడూ నష్టాలే అన్న చందంగా వుండే ఆర్టీసీ ఇప్పుడిప్పుడే ఆ కష్టాల నుంచి మెల్లమెల్లగా బయటకు వస్తోంది. వందల కోట్ల రూపాయల నష్టాలను గత ఏడాది గణనీయంగా సంస్థ తగ్గించుకోగలిగింది. గత ఏడాది కేవలం నష్టం వంద కోట్ల రూపాయలకు తగ్గిందని సంస్థ ప్రకటించింది. అయితే ఉద్యోగులకు పెద్దఎత్తున ఫిట్‌మెంట్ ప్రకటించడం మూలంగా భారం పెరిగినట్టు తెలుస్తోంది. సమ్మె నిర్వహించడం వల్ల కూడా నష్టాలకు కారణమన్న అభిప్రాయం యాజమాన్యంలో వుంది.