విశాఖపట్నం

మత్తులో యువత చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జూన్ 5: గు ట్కా, పాన్ పరాగ్, ఖైనీ, సిగరెట్, జర్థాకిళ్లీ చివరకు గంజాయి ఇలా అన్ని మ త్తు పదార్థాలకు అలవాటుపడుతున్న యువత తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. నగరంలో యథేచ్ఛగా సాగుతున్న వీటి క్రయ, విక్రయాలు నగర యువతను మత్తు పదార్థాల వైపునకు ఆకర్షించేలా చేస్తున్నాయి. నిషేధంలో ఉన్న ఈ మత్తు పదార్థాలు నగరంలోని అన్ని ప్రాంతాల్లో బహిరంగం గా కొన్ని, చాటుమాటున కొన్ని అమ్మకాలు సాగిస్తుడటంతో ఎక్కువ మంది వీటికి బానిసై ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. అధికార యంత్రాంగం మధ్య కొరవడిన సమన్వయ లోపం కారణంగా పక్కా రాష్ట్రాల నుండి వీటి దిగుమతి ఇష్టారాజ్యంగా సాగుతోంది. అడపా దడపా అక్కడక్కడా దాడులు చేసి పోలీసులు వీటిని స్వాధీనం చేసుకుంటున్నా, మాకేం కాదన్న రీతిలో తిరిగి వీటిని కొన్ని షాపుల వాళ్లు అమ్మకాలు చేస్తూనే ఉన్నారు. నగరంలోని ఏ ప్రాంతంలో చూసిన నిషేధిత గుట్కా, పాన్ పరాగ్, ఖైనీ విక్రయాలు జోరుగానే సాగుతున్నాయి. ముఖ్యంగా వైన్ షాపుల పక్కన ఉంటున్న దుకాణాల్లో వీటి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అలాగే కళాశాల యువత రాకపోకలు సాగించే ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న దుకాణాల్లో వీటిని ఎక్కువగానే విక్రయిస్తున్నారు. చేడు వ్యసనాలకు ఆకర్షితులవతున్న యువత వీటి బారిన పడుతూ ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే వీటిని సేవించేందుకు వీలుగా షాపులను ఏర్పాటు చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. మత్తు పదార్థాల విక్రయాలను కేంద్రప్రభుత్వం ఎప్పుడో నిషేదించిన వాటిని అమలు చేయడం మాత్రం క్షేత్రస్థాయిలో సాధ్యం కావడం లేదు. ఉత్తర భారతదేశంలో గతంలో ఎక్కువగా వినియోగించే ఖైనీ, గుట్కా, పాన్ పరాగ్‌ల సంస్కృతి నేడు తెలుగురాష్ట్రాలకు వ్యాపించింది. అలాగే ఒడిస్సాతో పాటు ఏఓబీ ప్రాంతాల్లో ఎక్కువగా సాగువుతున్న గంజాయి మన నగరం గుండానే వేరే ప్రాంతాలకు సరఫరా అవుతుంది. ఈపరిస్థితులతోనే ఇప్పటికే ఎక్కువగా గంజాయి పట్టుబడుతున్న సందర్భాలు ఇప్పుడు నగరంలో అధికంగానే ఉన్నాయి. అలాగే గుట్కా, ఖైనీలను విక్రయిస్తున్న వారు కూడా పెద్ద ఎత్తున పట్టుబడుతున్నా, వీటిని అమ్మేవారిలో భయం లేదు. వీటి రవాణాకు రహదారి, రైలు మార్గాలు ఎంతో అనువుగా ఉండటంతోనే వీటిని ఏ భయం లేకుండా ఇతర ప్రాంతాలకు సరఫరా చేయడంతో పాటు జిల్లాలోని నలుమూలలకు చేరవేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నా పరిస్థితిలో మాత్రం ఏ మార్పు రావడం లేదు. అత్యంత గోప్యంగా గంజాయిని మాత్రం నగరం మీదుగా పలు ప్రాంతాలకు సరఫరా అవుతూనే ఉంది. వీటికి బానిసవుతున్న యువత అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. క్యాన్సర్ సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న పొగాకు ఉత్పత్తులను వినియోగించవద్దని వైద్యులు సూచిస్తున్నా, ఎవరిలోనూ మార్పు రావడం లేదు.