విజయవాడ

యాదవ సమాజ చైతన్యానికే శంఖారావ రథయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 24: యుగయుగాలుగా ఎంతో గొప్ప చరిత్ర కలిగి శ్రీకృష్ణపరమాత్మ వారసులుగా వున్న యదువంశజులైన యాదవులు ఈనాడు అన్ని రంగాల్లో వెనుకబడి వుండటానికి కారణం చైతన్య రాహిత్యం, అనైక్యత, నాయకత్వలేమి, పోరాట పటిమ లేకపోవడమేనని యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ అన్నారు. అందుకు నిస్తేజంగా వున్న యాదవ జాతిని మేల్కొల్పి, చైతన్యాన్ని రగిలించి ఐకమత్యాన్ని పెంచి, బలమైన విస్తృత నాయకత్వాన్ని అందించి, కాటమరాజు పోరాటస్ఫూర్తిని ప్రతి యాదవునిలో నింపేందుకే రాష్ట్రంలో తాను యాదవ శంఖారావ రథయాత్ర నిర్వహించానన్నారు. కొలుసు భాస్కరరావు యాదవ్ అధ్యక్షతన ఆదివారం జరిగిన నగర కార్యవర్గ సమావేశానంతరం తనకు జరిగిన అభినందన సభనుద్దేశించి లాకా వెంగళరావు అన్నారు. తొలి విడతగా ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలోని యాదవులు రథయాత్రకు అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ వందలాది బైకులతో యువత పదుల కిలోమీటర్ల మేర భారీ ర్యాలీలతో మహిళలు, వృద్ధులు ఒకరేమిటి గ్రామగ్రామాన రథయాత్రను విజయపరంపరల జైత్రయాత్రలా కొనసాగిస్తూ భారీఎత్తున యాదవులు పాల్గొని జయప్రదం చేశారన్నారు. త్వరలో అన్ని డివిజన్లలో సభ్యత్వ నమోదును నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తిచేసి కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా నగర ప్రధాన కార్యదర్శి మాదాల శివరామకృష్ణప్రసాద్ అఖిల భారతీయ యాదవ మహాసభ విజయవాడ నగర కార్యవర్గానికి వివిధ డివిజన్ల కమిటీ సభ్యులకు పదవీ నియామక పత్రాలను అందజేశారు. కొలుసు భాస్కరరావు యాదవ్ మాట్లాడుతూ సంఘాన్ని నగరంలో నిర్మాణయుతంగా పటిష్టం చేసి, మరింతగా విస్తృతపరచాలని, నగర యాదవుల అన్ని సమస్యల పరిష్కారానికై నగర కమిటీ కృషి చేస్తుందన్నారు. రానున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నగరంలోని అన్ని డివిజన్లలో ఘనంగా జరపాలని కమిటీ పిలుపునిచ్చింది. బిసిల జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లను పెంచాలని, బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ల నివ్వాలని, నగర కార్యదర్శి, ఎపిఎస్‌ఆర్‌టిసి బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయి వెంకటేశ్వరరావు యాదవ్ ప్రతిపాదించిన తీర్మానాన్ని నగర కమిటీ ఆమోదించింది. ఎబివైఎం నగర యువజన విభాగ అధ్యక్షులుగా దూది బ్రహ్మయ్య యాదవ్‌ను, ప్రధాన కార్యదర్శిగా చెన్ను సురేష్ యాదవ్‌ను, ఉపాధ్యక్షులుగా యక్కల శ్రీనివాసరావ్ యాదవ్‌ను మరో 26 మందితో యాదవ మహాసభ యువజన కమిటీని జాతీయ కార్యదర్శి ఎవిఆర్ రాజు యాదవ్ ప్రకటించారు.