విజయవాడ

స్థానికంలో నోటాకు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయాడ(సిటీ), జూన్ 15: సార్వత్రిక ఎన్నికల సమయం ముగిసింది. ఇక స్థానిక సంస్థల సమరం ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కి ఉన్న నేపథ్యంలో జరగగున్న స్థానిక సంస్థల ఎన్నికలకు స్థానిక నేతలు సన్నద్ధవౌతున్నారు. కేంద్ర, రాష్ట్ర రాజకీయాలో సంబంధం లేకుండా పూర్తిగా స్థానిక వాతావరణ, రాజకీయ పరిస్థతుల నేపథ్యంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఏడాది నూతనంగా నోటా(నన్ ఆఫ్‌ది ఎబౌవ్)కు చోటు కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశేషప్రభావం చూపిన ఈ నోటా ఓటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రభావం బాగానే చూపనుంది. ఇప్పటికే సూత్ర ప్రాయంగా కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించిందనే వార్తలు అధికారులు నోటి నుండి వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు పూర్తి స్థాయిలో చైతన్యమైయ్యారని, నోటాను కూడా అధిక సంఖ్యలో వినియోగించుకున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నోటా తన ప్రభావం చూపేందుకు చోటు సంపాదించుకోనుంది. సార్వత్రిక ఎన్నికలు పూర్తిగా ఈవీఎం ద్వారా జరగగా, స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం బ్యాలెట్ పేపర్ పద్ధతిన జరగనున్నాయి. ప్రస్తుం అందరికీ రాజకీయ చైతన్యం పెరిగిన నేపథ్యంలో తమకు నచ్చిన వ్యక్తి ఓటు వేయడం ఎవరూ నచ్చకపోతే నోటాకు ఓటు వేయడం సార్వత్రిక ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో అయితే రాజకీయ పార్టీల ఓట్ల కంటే నోటాకే ఓట్లు అధికంగా వచ్చిన సందర్భాలను కూడా చూశాం. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని విజయవాడ పార్లమెంట్ విషయంలో మొత్తం 8889 ఓట్లు నోటాకు పడగా వీటితో పాటు పోస్టల్ బ్యాలెట్‌లో 22నోట్ల ఓట్లు పోల్ అయ్యాయి. అయితే ఎంపీగా కేశినేని శ్రీనివాస్ 8726 ఓట్లతో గెలుపొందారు. అంటే ఇక్కడ కూడా నోటా ఎంతో ప్రభావం చూపిందనే చెప్పాలి. ఇక మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా 14067 ఓట్లు నోటాకు పడగా వీటితో పాటు బ్యాలెట్ ద్వారా 34ఓట్లు నోటాకు పోల్ అయ్యాయి. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థికి వస్తే 16నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం ఓట్లు 23,651 నోటుకు పోల్ అయ్యాయి. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అతి తక్కువ ఓట్లతో ఓటమి చెందిన వారిపై ఈ నోటా ప్రభావం స్పష్టంగా కనిపించింది. సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బొండా ఉమా కేవలం 25ఓట్ల తేడాతో ఓటమి చెందగా ఈ నియోజకవర్గంలో 1061 ఓట్లు నోటాకు పోల్ అయ్యాయి. అన్ని నియోజకవర్గాల్లో మొత్తం పోలైనా ఓట్లలో నోటా ఓటు 0.50 శాతం పైగానే ఉందని చెప్పాలి. అత్యధికంగా తిరువూరు నియోజకవర్గంలో 1749 ఓట్లు నోటాకు పోల్ అయ్యాయి. ఈనేపథ్యంలో నోటాపై జిల్లాలోని ఓటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందనే చెప్పాలి. గతంలో ఎన్నడూ స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను ఉపయోగించని ఎన్నికల సంఘం ఈ ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నోటాను స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రవేశ పెడితే మాత్రం ప్రభావం మాత్రం పెద్దగానే చూపవచ్చు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా సార్వత్రిక ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టారు. కాని అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం నోటాను ఓటర్లను అందుబాటలో ఉంచలేదు. అయితే మొన్న జరిగిన తెలంగాణా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం నోటాను అధికారులు ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో కూడా నోటాను ప్రవేశపెట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుత జిల్లాలో ఉన్న మొత్తం ఓటర్లు 35,53,067 ఉండగా ఇందులో 27,80,576 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 23,651 మంది నోటాకు ఓటు వేశారు. అయితే స్థానిక సంస్థలు జరిగే ఎన్నికల్లో వీరి ఓటింగ్ శాతం సార్వత్రిక ఎన్నికల కంటే అధికంగానే నమోదు కావచ్చు. స్థానిక పోరు దగ్గర పడుతున్న సమయంలో నోటా ప్రవేశపెట్టేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. అయితే ఈనోటా ప్రయత్నం మాత్రం కొందరు రాజకీయ నేతల్లో కలవరపాటుకు గురి చేస్తోంది. సహజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు, ఓటముల వ్యత్యాసం చాలా తక్కువగానే ఉంటుంది. ఈనేపథ్యంలో నోటా వినియోగం పెరిగితే ఆప్రభావం వీరిపై స్పష్టంగా కనబడనుంది.