విజయవాడ

నూటికి నూరు శాతం అక్షరాస్యతకు ‘అమ్మఒడి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 16: రాష్ట్రంలో నూటికి నూరు శాతం అక్షరాస్యత సా ధన కోసమే సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. గాంధీనగర్‌లోని పూర్వ హిందూ హైస్కూల్ ప్రాంగణంలో దాతల సహకారంతో నూతనంగా ఏర్పాటైన చిట్టూరి విద్యా సంస్థను మంత్రి వెలంపల్లి ఆదివారం స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ సమాజానికి ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్ కమిటీ అందిస్తున్న సేవలు అపూర్వమన్నారు. హిందూ హైస్కూల్స్ కమిటీ దాదాపు 110 ఏళ్లుగా వివిధ విద్యా సంస్థలు ద్వారా విద్యా వ్యాప్తికి అలాగే సామాజిక వికాసానికి పాటుబడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ ప్రతి కుటుంబం తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సాధారణంగానే కలలు కంటుంటారు.. ఆ కలలు సాకారం చేసేందుకే జగన్ ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావిక్రింది రామస్వామి, గోపిశెట్టి మల్లయ్యలు మాట్లాడుతూ వందేళ్లకు పైగా తమ విద్యా సంస్థలు ఎల్‌కేజీ నుంచి సీజీ, ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తున్నదని తాజాగా సీబీఎస్‌సీ సిలబస్ కోసం ఈ పాఠశాలను ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ముప్పా వెంకటేశ్వరరావు, కమిటీ కోశాధికారి గోళ్ల బాబా విజయకుమార్, పాఠశాల కమిటీ అధ్యక్షులు చిట్టూరి ఆనంద్, ప్రధాన దాతలు చిట్టూరి నాగేంద్ర, కేబీఎన్ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు వంశధార హేమచంద్రరావు, తూనుగుంటల శ్రీనివాస్, పొట్టిశ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్షులు చలువాది మల్లిఖార్జునరావు తదితరులు ప్రసంగించారు. ప్రముఖ న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా వ్యాఖ్యతగా వ్యవహరించారు.