విజయవాడ

టీడీపీ ముగిసిపోయిన అధ్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 16: రాష్ట్ర ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా, ప్రతి పేదవారికి ఉజ్వల భవిష్యత్ అందించాలన్నదే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుక్షణం శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నగరానికి చెం దిన దండూరి దుర్గాప్రసాద్, అతని మి త్ర బృందం, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆదివారం వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా లాల్‌బహుదూర్ శాస్ర్తి నగర్ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభకు విష్ణు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎన్నడూ జరగలేని అవినీతి పాలన సాగిందని, టీడీపీ మంత్రుల దగ్గర నుంచి కింద స్థాయి కార్పొరేటర్ వరకు ప్రజాసొమ్మును అప్పనంగా దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుభవం ఉందని చెప్పుకున్న నాయకులంతా ఐదేళ్ల పాలనలో కాలయాపన చేసి ప్రజల సొమ్మును దోచుకోవడం తప్ప వారి సమస్యలేవి పట్టించుకోలేదన్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ కార్పొరేటర్లు బీహెచ్‌ఎస్వీ జానారెడ్డి, వీర్ల వరలక్ష్మీ, వైసీపీ రాష్ట్ర నాయకులు ఉమ్మడి వెంకట్రావ్, అవుతు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు చీరల పంపిణీ
పాత్రికేయుడు దండూరి దుర్గాప్రసాద్, ఎమ్మార్పీఎస్ నాయకులు, స్థాక పెద్దలు కత్తుల కాశీ, పులమద్ది రమేష్, కత్తుల దుర్గారావు, వై శ్రీ్ధర్‌రెడ్డి, దండూరి విష్ణువర్ధన్, చిరుగుపాటి సాంబయ్యతోపాటు 50 మంది పెద్దలు వైకాపాలో చేరారు. ఎమ్మెల్యే విష్ణు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం 300 మంది నిరుపేద మహిళలకు చీరలు, మజ్జిగ పంపిణీ చేశారు.