విజయవాడ

ప్రభుత్వ స్కూళ్లకు మాత్రమే అమ్మఒడి పథకాన్ని వర్తింపజేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 16: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కు మాత్రమే అమ్బఒడి పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ డీఎస్‌యూ) ఆధ్వర్యంలో స్థానిక లెని న్ సెంటర్‌లో ధర్నా జరిగింది. ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించాలని పెద్ద ఎత్తున నినాదాలు చే శారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీడీఎస్‌యు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం రామకృష్ణ, యు గనిరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్‌రె డ్డి ప్రభుత్వం 2020, జనవరి 26 నుం డి అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తామని, ప్రతి విద్యార్థికి రూ. 15వేలు ఇ స్తామని ప్రకటించిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేయడంతో ఆచరణ లో ప్రభుత్వ పాఠశాలలు దెబ్బతింటాయని అన్నారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభు త్వం పాఠశాల విద్యను పరిరక్షించాలని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అమ్మఒడి పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గుర్తింపులేని ప్రైవేట్ పాఠశాలలను రద్దు చేయాలని, విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర లాంటి ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా పాతపద్ధతిలో యథావిథిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ ఝాన్సీ, నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎం అని ల్, డీ సాహస, నాయకులు సాహిత్, సునీల్, రియాజ్ పాల్గొన్నారు.

ఘనంగా నగరోత్సవం
ఇంద్రకీలాద్రి, జూన్ 16: పౌర్ణమి సందర్భంగా దుర్గగుడి దేవస్థానం ఆ ధ్వర్యంలో శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి నగరోత్సవం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. శ్రీ మల్లిఖార్జున మహామండపం వద్ద సిబ్బంది పుష్పాలతో పల్లకిలను అందంగా అలకరించారు. ఒక పల్లకిలో శ్రీమల్లేశ్వరస్వా మి, గంగాపార్వతీ సమేతంగా రెండో పల్లకిలో వినాయక, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, 3వ పల్లకిలో శ్రీ చండీశ్వరస్వా మి, తదితర ఉత్సవ మూర్తులను ఉం చారు. ముందుభాగంలో మహిళలు, భజన మండలి సభ్యులు సంకీర్తన చే స్తుండగా స్వామి నగరోత్సవం ప్రారంభమైంది. దుర్గగుడి దేవస్థానం ఈవో వీ కోటేశ్వరమ్మ ఆహ్వానం మేరకు మం త్రి వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అ తిథిగా విచ్చేశారు. దుర్గగుడి స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్ మంత్రి, ఈవో, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్‌చేత ప్రత్యేక పూజలను చే యించారు. ఈకార్యక్రమానికి భక్తులు విచ్చేసి జై దుర్గా భవానీకి జై అంటూ నినాదాలు చేస్తుండగా నగరోత్సవం బయలు దేరింది. శ్రీ మల్లిఖార్జున మహామండపం వద్ద నుండి కనకదుర్గనగర్, రథం సెంటర్ మీదుగా కెనాల్‌రోడ్ వినాయకుని గుడి సెంటర్‌కు చేరుకుంది. అక్కడ నుండి తిరిగి కెనాల్‌రోడ్ మీదుగా దుర్గా ఘాట్‌కు చేరుకుంది. ఘాట్ వద్ద కృష్ణమ్మకు ప్రత్యేక పూజల అనంతరం పంచహారతులను నిర్వహించారు. అనంతరం ఘాట్‌రోడ్ మార్గం గుండా ఇంద్రకీలాద్రికి చేరుకొంది. పీఆర్‌ఓ కే బలరామ్, వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాసశాస్ర్తీ, పర్యవేక్షకుడు కేవీడీ ప్రసాద్, ఫెస్టివల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.