విజయవాడ

బిన్ ఫ్రీగా నగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 24: నగరాన్ని లిట్టర్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో మొత్తం నగరంలో బిన్ ఫ్రీ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. సోమవారం వీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన అనంతరం వీఎంసీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో అన్ని శాఖల హెచ్‌వోడీలతో సమీక్షా సమావేశం నిర్వహించి వీఎంసీలో అమలవుతున్న పథకాలు, విధానాలను తెలుసుకున్న అయన మాట్లాడుతూ వీఎంసీ విధి విధానాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలు సక్రమంగా అమలుచేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువైయ్యేలా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. అదేవిధంగా నగరంలో వందశాతం ప్లాస్టిక్ నిషేధం అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. నగర వ్యాప్తంగా ప్రస్తుతం 31 డివిజన్లలో అమలులో ఉన్న బిన్ ఫ్రీ విధానాన్ని మిగిలిన డివిజన్లలో కూడా అమలుచేసి మొత్తం నగరాన్ని బిన్ ఫ్రీగా తీర్చిదిద్దాలన్నారు. పారిశుద్ధ్య వాహనాలతోపాటు మిగిలిన అన్ని వాహనాలకు జీపీఎస్ మోనటరింగ్ సిస్టంకు అనుసంధానం చేసి పర్యవేక్షణ జరుగునట్టుగా చూడాలన్నారు. నగరంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి పరుచుటకు చర్యలు తీసుకోవాలని, గ్రీనరీ సుందరీకరణకు ప్రాముఖ్యతనిస్తూ కిచెన్ రూఫ్, రూఫ్ టాప్ గార్డెన్‌లను ప్రోత్సహించాలన్నారు. అన్ని మున్సిపల్ స్కూళ్లలో గ్రీనరీ అభివృద్ధి చేయాలని, పిల్లలకు స్కిల్ డెవలప్‌మెంట్ పై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న ఆయన ఉద్యోగులు కూడా తమ విధి నిర్వహణను బాధ్యతగా నిర్వర్తించి ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు. విధుల్లో అలసత్వం వహించిన వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించిన ఆయన ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. ప్రజలకు అవసరమైన వౌలిక సదుపాయాల కల్పనలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని తెలిపారు.

పర్యాటకాభివృద్ధి సంస్థ సీఈఓగా
ప్రవీణ్‌కుమార్ బాధ్యతల స్వీకరణ

విజయవాడ, జూన్ 24: ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్వహణ సంచాలకులుగా సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత నగరంలోని ఏపీ టీడీసీ కార్యాలయంలో ఉదయం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం రాష్ట్ర స్థాయి కలెక్టర్లకు వెళ్లారు. బిహార్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ 2006 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఎన్నికలకు ముందు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆయన ప్రస్తుత బదిలీల్లో భాగంగా ఏపీ టీడీసీ ఎండీగా వచ్చారు. పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్వహణ సంచాలకులుగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుసరించి పర్యాటక రంగాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏపీ టీడీసీ ఈడీ కుమార్, శ్రీదేవి, విశ్వనాథం, ఏపీటీఏ అధికారులు సాంబశివరాజు, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.