విజయవాడ

అవినీతిని అంతం చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 24: ప్రతిష్టాత్మకమైన నగర పాలక సంస్థలో అవినీతికి తావులేకుండా పారదర్శకమైన పాలన అందించడానికి విస్తృత చర్యలు తీసుకోనున్నట్టు వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు. సోమవారం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నగర పారిశుద్ధ్యాన్ని ప్రధాన అంశంగా తీసుకుని నగరాన్ని లిట్టర్ ఫ్రీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. పాలనలో మెరుగైన సేవలందిస్తానని, ఏ స్థాయిలోనూ అవినీతికి తావులేకుండా సేవలందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానన్నారు. ఇందుకు ప్రజలు తమ పూర్తి సహకారం ఇవ్వాలన్నారు. ఎవరైనా తమను లంచం అడిగితే నేరుగా తనకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగంలో పనిచేస్తూ కొంతకాలంగా తాను నగరంలో ఉంటున్నందున కొన్ని సమస్యలు తనకు తెలుసునని, ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. నగర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజారోగ్యాన్ని కాపాడుతానన్నారు. లిట్టర్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో నదీ కాలువలను కూడా శుభ్రంగా ఉంచుతామన్నారు. నగరంలో ప్లాస్టిక్ నిషేధం ఇప్పటికే అమలులో ఉన్నందున దానిని మరింత పటిష్ఠంగా అమలుచేసి పర్యావరణానికి హాని లేకుండా తీసుకునే చర్యలలో ప్రజలను కూడా భాగస్వాములుగా చేస్తామన్నారు. రక్షిత నీటి సరఫరాను మెరుగుపర్చే క్రమంలో ప్రజలు నీటి వృథాను అరికట్టాలని కోరారు. 24/7 నీటి సరఫరా చేసి నగరంలో ఎక్కడా నీటి కొరత లేకుండా చేస్తానన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో అవసరమైన చోట్ల ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, బందర్, ఏలూరురోడ్లలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తానని తెలిపారు. అర్బన్ గ్రీనరీ అభివృద్ధికి అవసరమైన ఖాళీ స్థలాలు లేనందున రూఫ్ టాప్, కిచెన్ గార్డెన్ వంటి ప్రక్రియలను ప్రోత్సహిస్తామన్నారు. ఉద్యోగుల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారి సమస్యలను పరిష్కరించి వారితో బాధ్యతగా విధులను నిర్వర్తింపజేస్తామని, ఉద్యోగులు ఎక్కడా, ఏ విషయంలోనూ అవినీతికి పాల్పడకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తామన్నారు. వీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి పనిలోనూ ప్రజలు కూడా భాగస్వాములైతేనే పూర్తి లక్ష్యసాధనకు చేరుకుంటామని, ప్రజలు అన్ని విషయాల్లోనూ సహకరించాలని ప్రసన్న వెంకటేష్ కోరారు. ఈసందర్భంగా అదనపు కమిషనర్ డీ చంద్రశేఖర్, ఎస్‌ఈ రామకృష్ణ, సీఎంహెచ్‌ఓ అర్జునరావు, పలువురు హెచ్‌ఓడీ అధికారులు, వీఎంసీ ఉద్యోగ సంఘ నేతలు జీ అజయ్, ప్రభావతి, వీఎంసీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌కు అభినందనలు తెలిపారు.