విజయవాడ

6లక్షల మంది విద్యార్థులకు ‘అమ్మఒడి’ లబ్ధి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), జూన్ 24: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని చూస్తున్న అమ్మఒడి పథకం ఆది నుండి ఎన్నో అనుమానాలను రేకెత్తించింది. అమ్మఒడి పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకే అంటూ కొన్ని రోజులు.. కాదు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా అంటూ విభిన్నవాదనలు వినిపించాయి. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకంపై పూర్తి స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ వర్తింస్తుందని, విద్యార్థి తల్లికి తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు ఉండాలని పేర్కొంది. పథకానికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు మాత్రం విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, వచ్చే ఏడాది జనవరి 26నుండి అమల్లోకి రానున్న అమ్మఒడి పథకం ద్వారా జిల్లాలో సుమారు 6లక్షల మంది విద్యార్థులు లబ్ధిపొందనున్నారు. ఈ పథకం కింది జిల్లాకు సుమారు రూ. 750కోట్ల వరకు విడుదల కావచ్చు. రేషన్ కార్డు ప్రాతిపదికన విద్యార్థుల తల్లి బ్యాంకు అకౌంట్‌కు అమ్మఒడి డబ్బులు జమ కానున్నాయి.
అక్షరాస్యతను పెంచే క్రమంలో చిన్నారులను పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమ్మఒడి పథకం ఈ విద్యాసంవత్సరం నుండే అమలులోకి రానుంది. గత ఏడాది విద్యా సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా ఉన్న 6 లక్షల మంది విద్యార్థుల్లో సుమారు 60వేల మంది 10వ తరగతి పరీక్ష రాసి ఇంటర్‌మీడియట్‌లోకి వెళ్లారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే మొదటి తరగతిలో సుమారుగా 50వేలకు పైగా విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. మొత్తం విద్యార్థులకు ఈ పథకం ప్రస్తుతం వర్తించనుంది. ఇందులో తెల్లరేషన్ కార్డు ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పథకం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు దీనిపై కసరత్తు కూడా మొదలుపెట్టారు. జిల్లాలో ఉన్న మొత్తం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. మొదటి తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల పూర్తి సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు.
ఆరంభంలో ప్రభుత్వ పాఠశాలల వైపే చూపు
బడిఈడు పిల్లలను బడికి తీసుకెళ్లేందుకు ప్రవేశ పెట్టిన అమ్మఒడి పథకం విద్యాసంవత్సరం మొదటిలో ప్రభుత్వ పాఠశాలలను ఎంతగానో ఆకర్షించింది. పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందని పలు దఫాలుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో దిగువ మధ్యతరగతి కుటుంబీకులు తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకొచ్చారు. కాస్తోకూస్తో స్తోమత ఉన్న వారు ప్రైవేటు స్కూల్స్ కంటే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకు రావడంతో ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థుల నమోదు శాతం పెరిగిందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఒకప్పుడు విద్యార్థుల కోసం ఎదురు చూసే ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల తల్లిదండ్రులు క్యూకట్టారు. తగినంత విద్యార్థుల సంఖ్య లేని కారణంగా రెండేళ్ల క్రితం రేషనలైజేషన్ పేరుతో ప్రాథమిక పాఠశాలలను భారీగా మూసివేశారు. ప్రస్తుతం ఈ పథకం ద్వారా తిరిగి వాటికి పూర్వ వైభవం వస్తుందని అందరూ భావించారు. అలాగే తాజా ప్రభుత్వ కొత్త యాప్‌ను రూపొందించి అందులో ప్రభుత్వ పాఠశాలల వివరాలను, సంపదను సైతం నమోదు చేసి పూర్తి వివరాలను సైతం సేకరించింది. తద్వారా మరి కొనే్నళ్లలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతాయని అందరూ భావించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగితే ఉపాధ్యాయుల పోస్టులు పెరిగి నిరుద్యోగులకు కూడా ఉపాధి లభిస్తుందని అందరూ ఉహించారు.
తాజా ప్రకటనతో విద్య వ్యాపారంగా మారనుందా?
అమ్మఒడి పథకం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు అన్నింటికీ వర్తించేలా ప్రభుత్వ తాజా ప్రకటనతో విద్య వ్యాపారంగా మారనుందా అనే అనుమానాలు వ్యక్తవౌతున్నాయ. అమ్మఒడి పథకం కేవలం ప్రభుత్వం పాఠశాలలకు వర్తింపజేస్తే ఆదరణ పెరుగుతుందని ఒకవైపు వాదన వినిపిస్తూనే ప్రైవేటు పాఠశాలలకు వర్తింపజేస్తే పరిస్థితి తారుమారు అతుందంటున్నారు. ఇప్పటికే విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు లక్షలు సంపాందించుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా రూ.15వేలను అందిస్తున్నందుకు ప్రైవేటు పాఠశాలల్లో చదివించేందుకే తల్లిదండ్రులు ముందుకు రానున్నారు. ఇప్పటికే అమ్మఒడి పథకం పేరుతో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు తల్లిదండ్రులను మభ్యపెడుతున్న సందర్భంలో ప్రభుత్వ ప్రకటనతో వారికి మంచి ఊతం ఇచ్చినట్లయంది. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు మంచి అనుభవం, అర్హత ఉన్నవారే. డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఎంపిక అవుతారు. ఇప్పుడిప్పుడే ఆరో తరగతి నుండి 10వ తరగతిలో చదువుతున్న విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు దీటుగానే ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని చెబుతున్న ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పరోక్షంగా ఉన్న వాటిని ఎత్తివేత దిశగా అడుగులు వేస్తున్నట్లుగా ఉందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
జిల్లాలో హైస్కూల్, ప్రాథమిక, ప్రాథమికోన్నత, మున్సిపల్‌తో కలిపి మొత్తం 4563 పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 2,93,626 మంది విద్యార్థులు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,81,938 మంది, హైస్కూళ్లలో 1,19,563 మంది విద్యార్థులు గత విద్యాసంవత్సరంలో చదివారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో కలిపి మొత్తం 5,95,127 మంది విద్యార్థులు విద్యాభాస్యం చేశారు. వీరిలో సుమారు లక్ష మంది వరకు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్మీడియట్‌కు వెళ్లారు. అయితే 2019 విద్యాసంవత్సరానికి సంబంధించి సుమారు 75వేలకు పైగా విద్యార్థులు కొత్తగా పాఠశాలలకు హాజరు కానున్నారు.