విజయవాడ

క్యాన్సర్ పేషెంట్లు, వికలాంగుల కోసం వైస్క్రీన్స్‌లో నేడు, రేపు ఉచిత చిత్ర ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 26: వికలాంగులు, క్యాన్సర్ పేషెంట్ల కోసం విజయవాడ వైస్క్రీన్స్ సంస్థ సరికొత్తగా ఆలోచించింది. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఉన్న మినీ ఫ్లెక్స్‌లను నిర్మించిన వైస్క్రీన్స్ సంస్థ వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో ఆలోచిస్తోంది. ఆ ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే వికలాంగులకు, క్యాన్సర్ పేషెంట్ల కోసం సినిమా ప్రదర్శించటం. వైస్క్రీన్స్‌లో రెండు రోజులపాటు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. కబాలి చిత్రాన్ని ఉచితంగా చూడవచ్చని అధినేత యార్లగడ్డ రత్నకుమార్ ప్రకటించారు. 27, 28న రెండు షోలు వీరి కోసం ప్రదర్శిస్తున్నారు. వీరితోపాటు మరొక సహాయకుడిని కూడా తీసుకువచ్చి ఉచితంగా సినిమా చూసే అవకాశం వైస్క్రీన్స్ ఏర్పాటు చేసిందని సిఎండి రత్నకుమార్ తెలిపారు. వీరికి ఫుడ్ కోర్టులో 50శాతం రాయితేకే ఆహారం సరఫరా చేయటానికి వైస్క్రీన్స్ నిర్ణయించిందని రత్నకుమార్ తెలిపారు. ఈ షోకు వచ్చే వారు ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని రత్నకుమార్ ప్రకటించారు.