విజయవాడ

డీలర్ల కమీషన్ పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూలై 26: ప్రభుత్వం రేషన్ డీలర్ల కోరిక తీర్చింది. ఎప్పటి నుంచో రేషన్ షాపుల నుంచి కమిషన్ పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్న సందర్భంగా మంగళవారం వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పుష్కరాల కారుకగా వారికి ప్రభుత్వం రేషన్ షాప్స్ డీలర్స్ కమిషన్ పెంచడంతో ప్రభుత్వంపై 77.44కోట్లు పడనుంది. కేంద్ర ప్రభుత్వం కూడా 50శాతం వరకు నిధులు దీనికి ఇవ్వనుంది. దాంతో వారు నిధులు 77కోట్లు వరకు ఉంటుంది. మిగతా నిధులు రాష్ట్రప్రభుత్వం భరించనుంది. దీంతో రేషన్ డీలర్ల బాధ్యతగా సరుకులు పంపిణీ చేయాలని మీడియాతో చెప్పారు. వారు ఏవిధమైన అక్రమాలకు పాల్పడకుండా నిజాయితీగా లబ్ధిదారులకు సరుకులు అందించాలని ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో తెలిపారు. ఏ విధమైన అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతినెలా మొదటి తారీకు నుండి 20 వరకు సరుకులు వినియోగదారులకు అందించాలని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. నెలలో ఉన్న మిగతా 10రోజులు వారు సరుకులు తీసుకోవటానికి సరిపోతుందన్నారు. అదేవిధంగా రేషన్ షాపుల్లో ఇప్పటికే ఈపోస్ విధానం అమలుచేస్తున్నట్లు చెప్పారు. దాంతో ఒక నెల లబ్ధిదారుడు రేషన్ షాపుల నుండి సరుకులు తీసుకోకపోయినా రెండు నెలలు వరకు వారు సరుకులు తీసుకునే అవకాశం ఇస్తున్నట్లు అది ఈపోస్ విధానంలో సాధ్యవౌతుందన్నారు. తెల్లకార్డుదారుడు సరుకులను వారు కోరుకున్న చోట తీసుకునే వెసలుబాటు దీంతో సాధ్యవౌతుందని తెలిపారు. సరుకులు లబ్ధిదారుడి ఇంటికే డెలివరి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన రంజాన్ తోఫా, చంద్రన్న సంక్రాంతి కానుకలతో తమకు కమిషన్ రావటం లేదని కమిషన్ పెంచాలని ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో ప్రభుత్వం కమిషన్ పెంపుదలతో వారికి కూడా న్యాయం చేసినట్లు అయింది.