విజయవాడ

వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జూలై 28: గాంధీ హిల్ తమిళ సంఘం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఆడికృత్తిక కావడి మహోత్సవం తమిళ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. గురుస్వాములు శేఖర్, రవి, బాలు, తదితరుల ఆధ్వర్యంలో ఈ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం గాంధీహిల్ పక్కనే సంఘం ఆధ్వర్యంలో గురుస్వాములు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, అయ్యప్ప, వినాయకుడు తదితర దేవతమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి, వారికి నివేదించిన మహా ప్రసాదాన్ని భక్తులకు భోజనాలుగా పెట్టారు. సాయంత్రం ట్రాక్టర్‌ను వివిధ పుష్పాలతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేసి స్వామిని ప్రతిష్టించారు. తర్వాత కొంతమంది నోటికి ఇనుప త్రిశూలాలు గుచ్చుకుని కావళ్లు మోశారు. మరికొంతమంది వీపునకు ఇనుప కొక్కెం తగిలించుకొని స్వామి ట్రాక్టర్ లాగారు. గాంధీ హిల్ వద్ద ప్రారంభమైన ఈ మహోత్సవం రాజకుమారి థియేటర్, జెండా చెట్టు సెంటర్ మీదుగా రాయల్ హోటల్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ నుండి తిరిగి చేపల మార్కెట్ రోడ్, కోమల విలాస్ సెంటర్ మీదుగా బ్రాహ్మణ వీధిలోని స్వామి ఆలయం మెట్ల వద్దకు చేరుకుంది. అక్కడ వారికి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం ఇవో ఘంటసాల శ్రీనివాస్ ఘన స్వాగతం పలికి కొండపై ఉన్న స్వామి సన్నిధికి తీసుకువెళ్ళి దర్శనం చేయించి ప్రత్యేక ప్రసాదాలు అందజేశారు. ఈ ఊరేగింపు మహోత్సవాన్ని పాతబస్తీ ప్రజలు అసక్తిగా తిలకించారు. వీపునకు కొక్కెం తగిలించుకుని ట్రాక్టర్ లాగి తమిళ సంఘ సభ్యులు వారి భక్తి చాటుకున్నారు.