విజయవాడ

మట్టి వినాయక ప్రతిమల వైపు ప్రజల మొగ్గు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఆగస్టు 24: ప్రజల్లో వాతావరణ కాలుష్యంపై అవగాహన పెరుగుతుంది. దానికి కారణం ఈ ఏడాది కుమ్మర్ల చేతుల్లో రూపుదిద్దుకుంటున్న మట్టి వినాయకుని విగ్రహాలే చెబుతున్నాయి. రంగులు అద్దిన విగ్రహాలు నదీ జలాల్లోగాని, పంటకాలువల్లోగాని నిమజ్జనాలు చేయడం వల్ల జలచరాలు మృత్యువాత పడుతున్నాయని, అలాగే పశువులు అలాంటి నీరు తాగడం వల్ల అస్వస్థకు గురవుతాయని వైద్యులు నిర్థారించడంతో ప్రభుత్వ, ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలు పనిగట్టుకుని ప్రచారం చేయడం జరుగుతుంది. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాల్లో ప్రసారాలు వల్ల ప్రజలు చైతన్యవంతులుగా మారుతున్నారు. దాంతో ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాల కోసం మట్టి వినాయక విగ్రహాలు తయారీలో వందలాది మంది కుమ్మర్లు నిర్విరామంగా పని చేస్తున్నారు. విద్యాధరపురంలోని కుమ్మరిపాలెం సెంటర్‌లోని సుమారు 60కుటుంబాలు 10రోజుల నుండి మట్టి వినాయకుని ప్రతిమలు తయారు చేస్తున్నారు. రంగురంగుల వినాయకుని విగ్రహాలను ప్రజలు దూరంగా ఉంచుతున్నారు. గత ఏడాది వేలల్లో మట్టి వినాయకుని బొమ్మలు తయారుకి ఆర్డర్లు రాగా ఈ ఏడాది లక్షలాది ప్రతిమలకు ఆర్డర్లు వచ్చాయని కుమ్మర్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, వాసవీ క్లబ్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ నాయకులు వినాయక మట్టి ప్రతిమలు ఉచితంగా పంచడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దాంతో సెప్టెంబర్ 2న వినాయక చతుర్థి ఉత్సవాలకు ఈనెల 15నుండే బొమ్మల తయారీకి ఆర్డర్లు రావడం గమనార్హం. వినాయక చవితి పందిళ్లలోనూ గత ఏడాదిలా రంగురంగుల ప్రతిమల సంఖ్య తగగనుందనీ అభిప్రాయాన్ని కుమ్మర్లు వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూలేనంత భారీ సంఖ్యలో తమకు ఆర్డర్లు రావడం ఎంతో ఆనందంగా ఉందని కుమ్మరిపాలెం ప్రాంతానికి చెందిన కుమ్మరి టీ నాగరాజు అన్నారు. కొత్తూరు తాడేపల్లి ప్రాంతంలోని కుమ్మర్లు కూడా మట్టి వినాయక ప్రతిమల తయారీలో నిమగ్నమయ్యారు. మట్టి అడుసును తొక్కడానికి వర్షాలు అడ్డంకిగా మారాయి. ఆధునిక మిక్సింగ్ మిషన్ సాయంతో మట్టి అడుసును బొమ్మల తయారీకి అనుకూలంగా మిక్సింగ్ చేయడంతో బొమ్మల తయారీ త్వరితగతిన రూపుదిద్దుకుంటున్నాయని కుమ్మరులు తెలిపారు. బొమ్మల అచ్చులు తయారీలో మట్టిని కూర్చి చెక్కతో కొట్టి బిగుతుగా మారిన తరువాత అచ్చును తిరగేస్తారు. అనంతరం గట్టి దారంతో డయిల్ నుండి బొమ్మని కత్తిరిస్తారు. తయారైన బొమ్మలను ఇళ్లలోనే గాలికి ఆరేలాగ చేస్తారు. సుమారు 24 గంటల వ్యవధిలో బొమ్మలు బిగుతుగా తయారవుతాయని అలాంటి బొమ్మలను వినాయక చతుర్థి పూజల్లో ఉపయోగించి అనంతరం నదీ జలాలు, పంట కాలువలు, చెరువుల్లో నిమజ్జనం చేసినా వెంటనే మట్టి విగ్రహాలు కరిగిపోతాయని కాలుష్యరహితంగా ఉంటాయని కుమ్మర్లు చెబుతున్నారు. గత ఏడాది జిల్లాలో సుమారు 5లక్షల మట్టి విగ్రహాలు తయారు కాగా ఈ ఏడాది వాటి సంఖ్య 7లక్షలకు పెరిగిందని కుమ్మరి నాగరాజు తెలిపారు. బొమ్మల సైజులను బట్టి రూ 10, 15, 20 ధరలకు మట్టి వినాయక ప్రతిమలు లభిస్తున్నాయి.