విజయవాడ

రేషన్ కార్డుల రద్దుపై ఆందోళన వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 24: 15ఏళ్లు పై బడిన వయస్సు కలిగిన వారు ఆధార్‌తో ఈ-కేవైసీ రేషన్ షాపులలో మాత్రమే నమోదు చేయించుకోవడం జరుగుతుందని, ఈ-కేవైసీ చేయించుకొనని పిల్లల యూనిట్లు రద్దు చేయబడవని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పేర్కొన్నారు. నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఈ-కేవైసీపై నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై రేషన్ కార్డుదారులు ఎటువంటి ఆందోళన చెందవద్దని సూచించిన కలెక్టర్ జిల్లాలో సుమారు మూడున్నర లక్షల మంది ఈ-కేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉందని, వీరిలో 15ఏళ్ల వయస్సు పైబడిన వారు ఆధార్ నెంబర్‌తో రేషన్ షాపు డీలర్ల వద్ద మాత్రమే ఈ-కేవైసీ నమోదు చేయించుకోవచ్చునని తెలిపారు. అటువంటి వారు ఆధార్ సెంటర్‌కు గానీ, పోస్ట్ఫాస్‌కు గానీ వెళ్లవలసిన అవసరం లేదన్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీలలో చదువుతున్న పిల్లలకు మూడు నెలల్లోగా వారి వద్దకే వచ్చి ఆధార్ నమోదు చేయడం జరుగుతుందని, దీనిపై ఎటువంటి ఆందోళన చెందవద్దని హితవుపలికారు. ప్రజాసాధికారిత సర్వే నమోదు చేసుకొనని వారు ఎన్యూమరేటర్, పంచాయతీ సెక్రటరీ,గ్రామ రెవెన్యూ, మున్సిపల్ ఆఫీస్ వద్ద ప్రజాసాధికారిత సర్వే నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

ఇళ్ల స్థలాల అర్జీల కోసం
స్పందనకు రావక్కర్లేదు
* 26, 27, 28న వలంటీర్లే ఇళ్లకు వస్తారు
* 30న తుది జాబితా విడుదల
* కలెక్టర్ ఇంతియాజ్
విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 24: ప్రజా సమస్యల పరిష్కారానికై నిర్వహించే స్పందన కార్యక్రమంలో ఎక్కువ భాగం ఇళ్ల స్థలాల అర్జీలు సమర్పించేందుకు ప్రజలు వస్తున్నారని, అయితే వారు స్పందనకు రానవసరం లేదని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పేర్కొన్నారు. వారి సౌకర్యార్థం వలంటీర్లే ఈనెల 26, 27, 28న వారికి కేటాయించిన గృహాలను సందర్శించి వివరాలను నమోదు చేసుకుంటారని తెలిపిన కలెక్టర్ గృహాల మంజూరు కొరకు ప్రభుత్వం నూతన విధి విధానాలను రూపొందించడం జరిగిందన్నారు. ఆయా అర్జీలను గ్రామ వలంటీర్లు పరిశీలించనున్నారని, ఇందకు వారికి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఈనెల 26 నుంచి 28వరకూ జరిగే గ్రామ, వార్డు వలంటీర్లు వారికి కేటాయించిన గృహాలకు నేరుగా వచ్చి లబ్ధిదారులు, మహిళల నుంచి ఆధార్, రేషన్ కార్డు, వ్యక్తిగత వివరాలను పూర్తి సమాచారాన్ని నమోదు చేసుకుంటారన్నారు. తదుపరి తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు ర్యాన్‌డం సర్వేచేసి లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుందన్నారు. ఈనెల 30న అర్హుల తుది జాబితా ప్రకటించనున్నట్టు తెలిపిన కలెక్టర్ గృహాల మంజూరు కొరకు అర్జీదారులు తమ ఇంటి వద్దకు వచ్చే గ్రామ వలంటీర్లకు వారి సమాచారాన్ని అందించి సహకరించాలని కోరారు.