విజయవాడ

ఆదర్శ పాఠశాలలో వనం-మనం కార్యక్రమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఆగస్టు 24: మండలంలోని గణపవరం ఆదర్శ పాఠశాలలో శనివారం వనం-మనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం పి గోపాల్ ఆధ్వర్యంలో స్కూల్ ఆవరణలో విద్యార్థులచే మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అటవీ శాఖ సామాజిక వన విభాగం అధికారిణి మోహినీ విజయలక్ష్మి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటటంతోపాటు వాటిని సంరక్షించాలన్నారు. హెచ్‌ఎం పి గోపాల్ మాట్లాడుతూ స్వచ్చమైన గాలి, వాతావరణంలోని సమతుల్యత కోసం మొక్కల పెంపకమే శ్రేయస్కరమన్నారు. ప్రతి వ్యక్తి తన పుట్టిన రోజున ఐదు మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈసందర్భంగా అటవీ అధికారిణి విజయలక్ష్మి విద్యార్థులందరికీ మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పూర్ణచంద్రరావు, హుస్సేన్, ఉషారణి, ఎస్‌ఎంసి సభ్యులు పాల్గొన్నారు.