విజయవాడ

ఆంధ్రకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), జూలై 29: సామర్థ్యం కోల్పోయిన రైలు బోగీలు, గూడ్స్‌వాగిన్‌లకు తిరిగి సామర్థ్యం కల్పించే విధంగా మరమ్మతులు చేసే రోలింగ్ స్కాన్ కాంపొనెంట్ రిహాబిలిటేషన్ వర్క్‌షాపును ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయటానికి రూ.280 కోట్ల నిధులను రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు విడుదల చేశారని దక్షిణ మధ్య రైల్వే జోనల్ సిపిఆర్‌ఓ ఉమాశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. రైలు బోగీలు, గూడ్స్ వాగిన్‌లు వాడకంలో వాటి సామర్థ్యం తగ్గడం సహజం. వాటిని తిరిగి రీ బిల్డింగ్ (ఆర్‌ఎస్‌సిఆర్‌డబ్ల్యు) వర్క్‌షాపుకు తరలించి వాటి సామర్థ్యాన్ని పెంచి తిరిగి ఆయా ప్రాంతాలకు పంపుతారు. అటువంటి రీబిల్డింగ్ ఆఫ్ కోచ్ ఫ్యాక్టరీని ఆంధ్రరాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి రైల్వే మంత్రి సురేష్ ప్రభు రూ.280 కోట్ల నిధులను మొదటి విడతగా విడుదల చేశారు. తొలుత ఈ వర్క్‌షాపును కడపలో ఏర్పాటు చేయాలని తలపెట్టినా అప్పటి ఎంపి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కర్నూలులో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించి స్థల సేకరణ సైతం చేపట్టారు. ఆ తరువాత భూమి వివాద కారణంగా అది కాస్త వాయిదా పడింది. దీనిని సికింద్రాబాద్‌లో, భువనగగిరి వద్ద ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదించినప్పటికీ ముఖ్యమంత్రి చొరవతో కర్నూలులోనే నిర్మించడానికి కాగితాలు కదిలాయి. దీంతో మొదటి విడతగా రూ.280 కోట్లు విడుదలయ్యాయి.