విజయవాడ

జోహార్ కోడెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 17: హైదరాబాద్‌లో అకాల మరణానికి గురైన మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు భౌతికకాయాన్ని తరలించే యాత్ర మంగళవారం కృష్ణాజిల్లాలో ఐదు గంటలకు పైగా కొనసాగింది. మధ్యాహ్నం 12.30 గంటలకు కృష్ణాజిల్లా సరిహద్దు గరికపాడుకు చేరుకోగా విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), మాజీ మంత్రులు దేవినేని ఉమా, నెట్టెం రఘురామ్, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య వందలాది మంది కార్యకర్తలు ఎదురేగి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోహార్ కోడెల నినాదాలు మార్మోగాయి. హైదరాబాద్ నుండి భౌతికకాయం వెంట ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ పెద్ద సంఖ్యలో నాయకులు తరలివచ్చారు. నందిగామ ప్రాంతంలో మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య నేతృత్వంలో వందలాది కార్యకర్తలు ఎదురేగి భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ కోడెల అంటూ పెద్ద ఎత్తున పూలు వెదజల్లారు. ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద అంతిమయాత్ర చేరుకునే సరికి డాక్టర్ కోడెల తనయుడు శివరామ్ అక్కడికి చేరుకుని తండ్రి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. పార్టీ నాయకులు ఆయన్ను సముదాయించి అంతిమయాత్రకు ముందుకు నడిపారు. గొల్లపూడి వద్ద ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, సీనియర్ నేత నాగుల్‌మీరా వందలాది నాయకులు, కార్యకర్తలు ఎదురేగి కోడెల భౌతికకాయానికి నివాళులర్పించారు. గొల్లపూడి నుండి భవానీపురం వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర చంద్రబాబు కాలి నడకన మిగిలిన నాయకులతో పాటు అంతిమయాత్రలో పాల్గొన్నారు. దారి పొడవునా వందలాది ప్రజలు బారులు తీరి చేతులెత్తి నమస్కరిస్తూ నివాళులర్పించారు. భౌతికకాయం ఉంచిన వాహనాన్ని కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు ప్రకాశం బ్యారేజీ నుండి గుంటూరు జిల్లాలోకి సాగనంపారు.
కుండపోత వర్షాన్నీ
లెక్కచేయని తమ్ముళ్లు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధువులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మృతిచెందిన కోడెల పార్థివదేహాన్ని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వెంట ఉండి గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చారు. సుమారు మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో కోడెల భౌతికకాయం గుంటూరుకు చేరుకుంది. మధ్యాహ్నం 3 గంటలకే కోడెల పార్ధివదేహం పార్టీ కార్యాలయానికి వస్తుందని తెలుసుకున్న కార్యకర్తలు, అభిమానులు జోరున వర్షం పడుతున్నా లెక్కచేయక కోడెలను చివరిగా చూసేందుకు భారీగా తరలివచ్చారు. రాత్రి సమయంలో కోడెల మృతదేహం రావడంతో చూసేందుకు కార్యకర్తలు కార్యాలయంలోకి ప్రవేశించడంతో ఒకింత తోపులాట చోటు చేసుకుంది. వేదిక చిన్నదిగా ఉండటంతో వచ్చేవారు, వెళ్లేవారికి సరైన మార్గం లేకపోవడంతో లోనికి వెళ్లినవారు కోడెల భౌతికకాయాన్ని చూసి బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పార్ధివదేహం వద్ద కోడెల తనయుడు శివరామ్‌తో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, తనయుడు లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్, ముఖ్య నేతలు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, వైవీబీ రాజేంద్రప్రసాద్, పరిటాల సునీత, నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, వర్ల రామయ్య, డొక్కా మాణిక్య వరప్రసాద్, జీవీ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్ వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో రాష్ట్ర పార్టీ కార్యాలయం నిండిపోయింది. కాగా నేడు కోడెల స్వగ్రామమైన నకరికల్లు మండల పరిధిలోని కండ్రకుంట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంచనాలతో కోడెల అంత్యక్రియలు బంధువులు, పార్టీ శ్రేణుల అశ్రునయనాల నడుమ ఘనంగా జరగనున్నాయి.