విజయవాడ

ఇసుక వ్యాపారుల వీధి పోరాటాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, సెప్టెంబర్ 17: ఇసుక వ్యాపారుల మధ్య విభేదాలు వీధి పోరాటాలుగా మారుతున్నాయి. టిప్పర్లు, లారీలకు ఇసుక లోడ్లు అందడం లేదుగాని వందలాది ట్రాక్టర్లలో మాత్రం ఇసుక రవాణా అవుతోంది. ఎలా, ఎవరిని మేనేజ్ చేస్తున్నారో తెలియదుగానీ ఇనే్నళ్లూ టిప్పర్ యజమానులు రాజ్యమేలిన ఇసుక క్యారీల కోటలో ట్రాక్టర్ యజమానులు పాగా వేశారు. దాంతో ట్రాక్టర్లలో ఇసుక రవాణా అవుతోందేగానీ ఆ ఛాన్స్ మాత్రం లారీలు, టిప్పర్ల యజమానులకు దక్కడం లేదు. సూరాయపాలెం, గుంటపల్లి, గొల్లపూడి, ఇబ్రహీంపట్నంకి చెందిన టిప్పర్ యజమానులకు గతం స్వర్ణయుగంగా గడిచింది. కానీ అనూహ్యంగా టీడీపీ ఘోర పరాజయం పాలవ్వడంతో లారీ యజమానుల పెత్తనం కూడా చతికిలబడింది. ఇసుక రాజ్యం కుప్పకూలింది. అధికార పార్టీ నాయకుల హవా పడగవిప్పింది. దాంతో తాము ఇన్నాళ్లూ ఏర్పాటు చేసుకున్న ఆదాయపు వనరులు తమముందే వేరేవారు తరలిస్తుంటే తట్టుకోలేని లారీ, టిప్పర్ల యజమానులు మంగళవారం తిరగబడ్డారు. మిల్క్ ఫ్యాక్టరీ ఎదుట రెండు ట్రాక్టర్లను నిలువరించారు. మాకురాని ఇసుక మీకెలా వస్తోందంటూ ట్రాక్టర్ల యజమానులను నిగ్గుతీశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వారి మాటలు లెక్కచేయని ఓ ట్రాక్టర్ యజమాని ట్రాక్టర్‌ని ముందుకు దూకించాడు. అయితే మోటారు బైక్‌తో వెంటాడిన ఓ యువకుడు ట్రాక్టర్‌ని సాయిరామ్ థియేటర్ వద్ద అడ్డుకొని ఆపేశాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. కాసేపు ట్రాఫిక్‌కి అంతరాయం కలిగింది. దాంతో ఇక్కడ కాదు, అక్కడే రీచ్‌ల వద్దే తేల్చుకుందామని ఎవ్వరిదారిన వారు వెళ్లిపోయారు. అందరూ అల్లరిపాలవ్వడం ఎందుకూ? కూర్చుని సర్దుకుందాం! .. అంటూ వెళ్లిపోవడం కొసమెరుపు!