విజయవాడ

బోట్లు, పంట్లు ప్రమాదాల నివారణకు కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 19: జిల్లాలో బోట్లు, పంట్లు మూలంగా జరిగే ప్రమాదాలను నివారించేందుకు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పేర్కొన్నారు. బోట్లు, పంట్లు ప్రమాదాలను నివారించి ముందు జాగ్రత్తలు చేపట్టేందుకు పోర్టు, ఇరిగేషన్, పోలీసు, రెవెన్యూ, మత్స్య, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి కమిటీలో రెవిన్యూ, పోలీసు, ఇరిగేషన్, పర్యాటక, మత్స్య, అగ్నిమాపక శాఖ తదితర శాఖల అధికారులతో కమిటీని వేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పంట్లు, బోట్లను గుర్తించి సంబంధిత యజమానులతో అనుమతుల కోసం దరఖాస్తు చేయించాలని తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో ఆయా ప్రాంతాల్లో ఎన్ని బోట్లు, ఎన్ని పంట్లు వినియోగంలో ఉన్నది గుర్తించి వివరాలు అందచేయాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అన్ని రిజిస్ట్రర్ బోట్ల అనుమతులను నిలుపుదల చేయడం జరిగిందన్నారు. రాష్టస్థ్రాయిలో వేసిన కమిటీ నివేదిక అందిన తర్వాత తదుపరి కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో కూడా టూరిజం శాఖ పరిధిలో వినియోగించే బోట్లు ఇతర ప్రాంతాల్లో వినియోగిస్తున్న బోట్లు, పంట్లను నిలుపుదల చేయాలన్నారు. డైరెక్టర్ ఆఫ్ పోర్టు నిర్దేశాల మేరకు బోట్లు, పంట్లు పిట్‌నెస్ కోసం నిర్దేశించిన ఫారంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నందిగామ, ఇబ్రహీంపట్నంకు సంబంధించి విజయవాడ ఆర్డీఓ, సంబంధిత డిఎస్పీ, టూరిజం, ఇరిగేషన్ తదితర అధికారులతో సమావేశం నిర్వహించాలన్నారు.