విజయవాడ

అమ్మ ఒడి పథకం దేశానికే అదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 19: పిల్లలను పాఠశాలలకు పంపించేలాగా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదని ఎస్సీ జాతీయ కమిషన్ సభ్యులు కే రాములు పేర్కొన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు, ఎట్రాసిటీ కేసుల పరిష్కారం తీరును సమీక్షించిన రాములు మాట్లాడుతూ అమ్మ ఒడి పథకంతో ప్రజల్లో అక్షరాస్యత శాతం పెరిగి పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ శాతం తగ్గాయన్నారు. తమ పిల్లలను స్కూళ్లకు పంపితే ఆ తల్లులకు రూ.15వేల ఆర్థిక చేయూతను అందించేలా, ఎంతో దూరదృష్టితో ప్రవేశపెట్టిన ఈపథకం సామాజిక అభ్యున్నతికి దోహదపడుతుందన్నారు. సీఎం జగన్‌పై భరోసాతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఏడాదిలో అదనంగా 10వేల మంది విద్యార్థులు చేరడం విశేషమన్నారు. అట్రాసిటీ కేసుల పరిష్కారంలో పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని, ఎవరైన ఎట్రాసిటీ కేసులు నమోదు చేసిన సమయంలో ఉభయులను పిలిచి కౌనె్సలింగ్ చేయాలన్నారు. గాయాలు పాలై ఆస్పత్రిలో చేరిన సంఘటనలో తక్షణమే ఆ కేసుల విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలన్నారు. అత్యాచారాల కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని బాధితులకు ఇల్లు, భూమి, ఉద్యోగ కల్పన, నష్టపరిహారం వంటి సమకూర్చాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించి 31 అట్రాసిటీ కేసులు, 5రేప్ కేసులు, రెండు భూ వివాదం, రెండు హత్య కేసులపై తీసుకున్న చర్యలను సంబంధిత పోలీసు అధికారులతో సమీక్షించిన రాములు, నగరానికి సంబంధించి రెండు హత్య కేసులు, రెండు అత్యాచారం, 25 అట్రాసిటీ కేసులను పరిష్కార తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీలకు జాతీయ ఉపాధి హామీ పథకం, వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు, పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, తదితర అంశాలపై కూడా అధికారులతో ఆయన సమీక్షించారు. కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ గత సమావేశంలో పేర్కొన్న అంశాల మేరకు అట్రాసిటీ కేసులకు సంబంధించి పరిహారాలు అందించడం జరిగిందని, ఆగస్టు 23న విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించామన్నారు. జిల్లాలో సంక్షేమ హాస్టల్స్‌లో రూ.1.13 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ తదితర వర్గాలకు వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలుపై ఈనెల 26న ప్రజా ప్రతినిధులు, బ్యాంకర్లు, అధికారులతో డీఎల్‌ఆర్‌సీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈసమావేశంలో జిల్లా ఎస్పీ ఎం రవీంధ్రనాథ్ బాబు, జాయింట్ కలెక్టర్ కే మాధవీలత, జేసీ -2 కే మోహనకుమార్, అడిషనల్ సీపీ డీ నాగేంద్రకుమార్, డీఆర్వో ఏ ప్రసాద్, సోషల్ వెల్ఫేర్ జేడీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.