బిజినెస్

ప్రయాణికులపై ప్రైవేటు దసరా దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 5: దసరా పండుగ సందర్భంగా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వారి స్వస్థలాకు అధిక సంఖ్యలో ప్రజలు కుటుంబ సమేతంగా రాకపోకలు సాగిస్తున్న దృష్టా రవాణా శాఖ ప్రజా రవాణాపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా ప్రైవేటు బస్సుల దోపిడీకి కళ్లెం వేసేందుకు జిల్లాలో తనిఖీలు నిర్వహించింది. ప్రైవేటు బస్సుల యాజమాన్యం ప్రయాణికుల నంచి అధిక వసూలుకు పాల్పడకుండా చర్యలు చేపట్టింది. కేసరపల్లి, గరికపాడు వద్ద డ్రైవ్ చేపట్టి దోపిడీ చేస్తున్న బస్సులపై 113 కేసులు నమోదు చేసింది. ఈసందర్భంగా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణికుల నుంచి టిక్కెట్ల ధరలు కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు తనిఖీలు చేపట్టామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి నిర్థిష్టమైన ధరలకు టిక్కెట్ల అమ్మక్రాలు జరగాలని వీటిని ఉల్లంఘించి, ప్రయాణికులను దోపిడీకి గురిచేస్తే సహించేదీ లేదని చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.