విజయవాడ

పట్టిసీమతో పెరిగిన భూగర్భ నీటి మట్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 4: పట్టిసీమ ప్రాజెక్టుతో గోదావరి, కృష్ణా జిల్లాల్లో భూగర్భ నీటి మట్టాలు పెరిగినట్టు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ అన్నారు. క్యాంపు ఆఫీసులోని తన కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రధాన కుడికాలువ ప్రవహించే పశ్చిమ గోదావరి జిల్లా తోటగొంది నుంచి ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న ఫెర్రి పరిసర ప్రాంతాల వరకు కూడా భూగర్భ నీటి మట్టాలు 3 శాతం వరకు పెరిగినట్టు తెలిపారు. పోలవరం ప్రధాన కుడి కాలువ ప్రవహించే ప్రాంతాల్లో భూగర్భ జలాలు సమాచారం తెలుసుకోవడానికి 13 పీజోమీటర్లు ఉన్నట్లు తెలిపారు. పట్టిసీమ నుంచి ఇప్పటి వరకు కృష్ణా నదికి వచ్చిన నీరు 6.3 టిఎంసిలు అన్నారు. ఇప్పటి వరకు కృష్ణా బ్యారేజ్ నుంచి రైతుల అవసరాల నిమిత్తం కాల్వలకు ప్రతి రోజు నీటి విడుదల చేస్తున్నట్టు, ఈ రోజు కూడా 18 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నట్టు తెలిపారు. గోదావరి నది నుంచి వృథాగా 25 టిఎంసిలు నీరు సముద్రంలోకి కలుస్తున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో కృష్ణానదిలో నీటి పరిమాణం పెరగటానికి అవకాశముందని, ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహం పెరిగిందన్నారు. కర్నాటక నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడటం వలన అక్కడ నుంచి నీటి విడుదలకు వారు చర్యలు తీసుకున్నారని దాంతో ఆలమట్టి నుంచి 1,43,387 క్యూసెక్కుల నీరు విడుదల జరుగుతుందని, అదే విధంగా నారాయణపూర్ నుంచి 1,55,240 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుందన్నారు. అదే విధంగా జూరాల నుంచి 73,870 క్యూసెక్కులు నీరు విడుదల చేసినట్టు వివరించారు.