విజయవాడ

ఆదమరిచారా అంతే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, అక్టోబర్ 12: నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే మిల్క్ ఫ్యాక్టరీ సమీపంలోని సీవీఆర్ ఫ్లైఓవర్ బ్రిడ్జీపై గోతులు యమపురికి దారుల్లా మారి నిత్యం ప్ర మాదాలు జరుగుతున్నాయి. ఎక్కడైనా మట్టిరోడ్డుపై తారుతో వేసిన రోడ్లు చి ద్రమై గోతులు పడటం జరుగుతుంది. బ్రిడ్జీపైనా గోతులు పడి ప్రమాదభరితంగా మారడం విడ్డూరంగా ఉందని వాహన యజమానులు విస్తుపోతున్నా రు. హైదరాబాద్ నుండి ఉత్తరాంధ్ర వై పు రాకపోకలు సాగించే వేలాది వాహనాలు ఈ బ్రిడ్జీపై నుండి ప్రయాణం సాగిస్తుంటాయి. అయితే ఇటు కబేళా సెంటర్ వైపు, అటు సీఎన్‌జీ గ్యాస్ బం కు వరకు బ్రిడ్జీపై గోతులు పడ్డాయి. బ్రి డ్జీపై అమర్చిన బ్లాకుల శ్లాబుల్లోని ఐర న్ చువ్వలు సైతం బయటపడ్డాయి. రా ష్ట్రంలో ఇలా ఐరన్ రాడ్డులు బయటపడిన చరిత్ర మరెక్కడా లేదని బ్రిడ్జీ ని ర్మించి పుష్కర కాలమైనా కాలేదని అ ప్పుడే నిర్మాణంలోని డొల్లతనం బయ ట పడిందని వాహన యజమానులు విమర్శిస్తున్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జీలు ఇలా వాటి నాసిరకం నిర్మాణాల గుట్టును ఈ గోతులు రట్టు చేస్తున్న చందంగా బ్రి డ్జీపై గోతులున్నాయి. చిన్నకారులు, ఆ టోలు, లారీల చక్రాలు ఈ గోతుల్లో ప డగానే ఇనుప చువ్వలు దిగబడి పంచ ర్లు అవుతున్నాయని వాహనాల యజమానులు అల్లాడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు అరకొరా రిపేర్లు చేయించారేగాని వాటివల్ల ప్రయోజనం చేకూరలేదు. ప్రస్తుతం భవానీలు, అమ్మవారి భక్తులు ఇబ్బందులు పడకుండా తాత్కాలిక రిపేర్లు చేపడుతున్నామని దసరా ఉత్సవాలు ముగిశాక రోడ్డు పూర్తిస్థాయిలో వేయిస్తామని మంత్రి వెలంపల్లి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.