విజయవాడ

వ్యాపార సంఘాలకు అండగా ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, అక్టోబర్ 13: నగరంలోని అన్ని వ్యాపార సంఘాలగు అండగా ఉంటానని, వారి సమస్యలు పరిష్కరించడానికి సాయపడతానని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఉదయం సామారంగం చౌక్ సమీపంలోని పార్కురోడ్డు మూడో అంతస్తులో నిర్మించిన విజయవాడ ఎలక్ట్రికల్స్ డీలర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జరిగిన డీలర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇలాంటి అసోసియేషన్లు, నిర్వాహకులు ప్రజా సంక్షేమానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని వ్యాపారాలు, లాభాపేక్ష లేకుండా సాగించడం, సామాజిక సేవలు చేయడంలో విజయవాడ నగరంలోని పాతబస్తీలోని పలు అసోసియేషన్‌లు ముందుంటున్నాయని ఆయన అభినందించారు. ఎంతో పేరు ప్రతిష్టలు మూటగట్టుకుంటున్న నగరంలోని వ్యాపారులు దేశ వ్యాప్తంగా తమదైన గుర్తింపు పొందారని మంత్రి వెలంపల్లి కితాబిచ్చారు. కార్యాలయం ప్రారంభించిన ఆయన చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన గావించారు. ఆ తరువాత అసోసియేషన్ పాలకవర్గం చాంబర్‌ని కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం లీలేష్ జైన్ స్వాగతం పలుకగా మంత్రి, అసోసియేషన్ నాయకులు వేదికను అలంకరించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు మంత్రిని శాలుగా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు రమేష్‌కుమార్ జైన్, ఉపాధ్యక్షులు ఎస్‌ఎస్‌ఆర్ మూర్తి, అశోక్‌కుమార్ జైన్, కార్యదర్శి తమ్మిన శ్రీనివాస్, జాయింట్ కార్యదర్శి కే నరసరాజు, కోశాధికారి రాహుల్ కుమార్, అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పసుమర్తి కామేశ్వరశర్మ, లీగల్ ఎడ్వైయిజర్, బెజవాడ బార్ మాజీ అధ్యక్షులు పిళ్లా రవి, మాజీ కార్పొరేటర్ మహాదేవు అప్పాజీరావు తదితరులు పాల్గొన్నారు.