విజయవాడ

నేటి నుంచి జాతీయ సఫాయా కర్మచారీ కమిషన్ ఛైర్మన్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), అక్టోబర్ 15: జాతీయ సఫాయా కర్మచారీ కమిషన్ చైర్మన్ మనహర్ వాల్‌జీ భాయ్ జాలా జిల్లాలో పర్యటించేందుకు రానున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు కె హర్షవర్ధన్ తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి హోదా ఉన్న ఆయన జిల్లాలో ఈ నెల 16 నుండి 22 వరకు పర్యటించనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 16న సాయంత్రం హైదరాబాద్ నుండి విజయవాడ చేరుకుని రాత్రికి రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహంలో బసచేస్తారు. 17న నగరంలో వివిధ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని, పలు శాఖల అధికారులతో భేటీ అవుతారు. 18న నగరంలో నిర్వహించే స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అదేరోజు సాయంత్రం వెలగపూడి సచివాలయాన్ని సందర్శించనున్నారు. 19న స్టేట్ గెస్ట్‌హౌస్‌లో వివిధ కార్పొరేషన్ల ఎండీలు, లీడ్ బ్యాంకు అధికారులతో సమావేశం కానున్నారు. విజయవాడ, అమరావతి ప్రాంతాలలో పారిశుద్ధ్య పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. 20న మధ్యాహ్నం విజయవాడ నుండి బయలుదేరి విశాఖపట్నం పర్యటనకు వెళ్లనున్నారు. 21, 22 తేదీల్లో విశాఖలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొని 22న మధ్యాహ్నం ఢిల్లీకి తిరుగుపయనం కానున్నట్లు ప్రకటనలో వివరించారు.

విద్యార్థులకు విలువలు నేర్పాలి
పెనమలూరు, అక్టోబర్ 15: విద్యార్థుల్లో స్వేచ్ఛ, భావోద్వేగ సమతుల్యం సాధించేందుకు, విలువలు నేర్పించేందుకు ఏర్పాటు చేసుకున్నదే ఆనంద వేదిక అని మండల విద్యా శాఖాధికారి కే వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని పాఠశాలల్లో రెండ్రోజులు నిర్వహించిన ఆనంద వేదిక శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడుతూ కథలు, కృత్యాలు, భావ వ్యక్తీకర, పాఠ్య ప్రణాళిక ద్వారా నవకౌశలాలు, విలువలను విద్యార్థులకు ఏవిధంగా నేర్పించాలనే దానిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీ సుధాకర్, వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ టెన్నిస్
పురుషుల జట్టు ఎంపిక
విజయవాడ (ఎడ్యుకేషన్), అక్టోబర్ 15: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం టెన్నిస్ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి డాక్టర్ ఈ త్రిమూర్తి తెలిపారు. ఎంపికైన జట్టు అక్టోబర్ 16 నుండి 20 వరకు బెంగళూరులోని జైన్ విశ్వవిద్యాలయంలో జరగనున్న దక్షిణ మండల అంతర విశ్వవిద్యాలయాల టెన్నిస్ పురుషుల చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుందన్నారు. వీ ప్రశాంత్‌కుమార్ రెడ్డి, ఎన్ ఆకర్ష్‌రెడ్డి (నారాయణ వైద్య కళాశాల - నెల్లూరు), ఎన్ జోయల్ సూరజ్ (గుంటూరు వైద్య కళాశాల), టీ రెడ్డి రూపేష్ (రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ - కడప) జట్టుకు ఎంపికయ్యారు. మేనేజర్‌గా నారాయణ వైద్య కళాశాల వ్యాయామ విద్యా సంచాలకులు జే శిల్విబాబు వ్యవహరిస్తారు.

రివర్స్ టెండరింగ్‌తో అభివృద్ధి రివర్స్
* మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ధ్వజం
విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 15: రాష్ట్రంలో అభివృద్ధి అంతా రివర్స్‌లో జరుగుతోందని, ఇందుకు నిదర్శనం మధురానగర్ ఆర్‌యూబీయే అని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం 45వ డివిజన్‌లోని మధురానగర్ వద్ద మచిలీపట్నం రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద నిర్మిస్తున్న రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన ప్రస్తుత వైకాపా ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.