విజయవాడ

ఇటు చెత్త రాగానే.. అటు పందులు రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, అక్టోబర్ 15: నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది పందుల పెంపకాన్ని చేపట్టారా? నమ్మండి, నమ్మకపోండి.. ఇది అక్షరాలా నిజమంటున్నారు స్థానికులు. పశ్చిమ నియోజకవర్గంలోని 30వ డివిజన్ శానిటరీ సిబ్బంది డివిజన్‌లో సేకరించిన చెత్తాచెదారాన్ని పాల ఫ్యాక్టరీ సమీపంలోని కాలువ వద్దకు తరలించి డంప్ చేస్తున్నారు. వెనువెంటనే పదుల సంఖ్యలో పందులు పరుగున ఆ చెత్తకుప్పపై ఎగబడి వ్యర్థాలను ఆరగిస్తున్నాయి. నిబంధనల ప్రకారం నగరంలోని చెత్తాచెదారాన్ని నగరానికి దూరంగా మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉంది. అయితే 30వ డివిజన్‌లో డంపర్ బిన్స్, లేదా ఇంటింటా చెత్త సేకరణ ద్వారా వచ్చిన చెత్తను ట్రాక్టర్ ద్వారా సీవీఆర్ సమీప మురుగు కాలువ వద్ద మంగళవారం ఉదయం డంప్ చేశారు. వెంటనే పందులు పరుగులు తీయడం చూస్తుంటే ఇది నిత్యకృత్యమని భావించాల్సి వస్తోందని స్థానికులు తెలిపారు. శానిటరీ సిబ్బంది పనితీరుపై నగరపాలక సంస్థ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఇలా మార్గంమధ్యలోనే డంప్ చేస్తున్నారు. మేతకు అలవాటు పడినట్టుగా పందులు కూడా ట్రాక్టర్ రాకను గమనించి డంప్ చేసిన చెత్తగుట్టపై ఎగబడుతున్నాయి. గతంలో కూడా ఇదే ప్రాంతంలో సిల్ట్‌ని డంపింగ్ చేశారు. స్థానికుల నుండి వ్యతిరేకత రావడంతో ఆపేశారు. ప్రస్తుతం ట్రాక్టర్ ట్రక్ నిండా తెచ్చిన చెత్తను డంప్ చేస్తున్నారు. దీన్ని నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

దీపావళి పండుగకు ప్రమిదలు సిద్ధం
విజయవాడ పశ్చిమ, అక్టోబర్ 15: దీపావళి పండుగకు ప్రమిదలు సిద్ధమయ్యాయి. నగరవ్యాప్తంగా వందలాది మంది వ్యాపారులు ఇప్పటికే హోల్‌సేల్ వ్యాపారుల వద్ద లక్షలాది ప్రమిదలు కొనుగోలు చేశారు. వాటిని అమ్మడానికి షాపుల ముందు ప్రదర్శనకు పెట్టారు. దీపావళి పండుగంటే వయోబేధం లేకుండా పిల్లలు, పెద్దలు ఆనందంగా జరుపుకుంటారు. దీపాలు వరుసగా వెలిగించి అమావాస్య నాడు వచ్చే పౌర్ణమి అన్నట్టుగా వెలుగులు నింపుతారు. ఏటికేడాది ప్రమిదల ఆకారాలు, పరిమాణాల్లో మార్పులు చేస్టూ మట్టి ప్రమిదలు తయారు చేస్తున్న కుమ్మరులు తమ ప్రావీణ్యాన్ని చాటుకుంటున్నారు. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల నుండి ప్రమిదలు దిగుమతి అవుతున్నాయి. సాదా ప్రమిదలు డజన్ రూ. 20, 25లకు అమ్ముతున్నారు. డిజైన్ కలిగినవి రూ. 30, 40కి అమ్ముతున్నారు. కుందుల ప్రమిదలు జత రూ. 20, 30లకు, ఎత్తు కుందులు జత రూ. 50కి 5 వత్తుల ఎత్తు కుందులు, 9 వత్తుల ఎత్తు కుందులు, అలాగే తాబేళ్ల కుందులు రూ. 100 నుండి 500 వరకు ధర పలుకుతున్నాయి. టెంకాయ దీపాలు, ఆకాశ దీపాలు రూ. 50 ధర పలుకుతున్నాయి. మట్టి ప్రమిదల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారని, ఆకర్షణీయ డిజైన్ల పట్ల ఆకర్షితులవుతున్నారని నాలుగు స్తంభాల సెంటర్‌కు చెందిన ప్రమిదల వ్యాపారి అన్నవరపు కుమారి తెలిపారు.

పోలీసు స్టేషన్లలో ఓపెన్ హౌస్
* పనితీరును చిన్నారులకు వివరించిన సీఐలు
విజయవాడ పశ్చిమ, అక్టోబర్ 15: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పశ్చిమలోని వన్‌టౌన్, టూటౌన్, భవానీపురం పోలీసు స్టేషన్‌లలో ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించారు. పోలీసుల ప్రాణత్యాగాలు, పోలీసు పహరాల వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది, ఎలాంటి సమయాల్లో తుపాకీని వాడతారు, అసలు తుపాకీ ఎలా పనిచేస్తుంది తదితర విషయాలను సీఐలు, ఎస్‌ఐలు విద్యార్థులకు వివరించారు. పోలీసులంటే కొందరు పిల్లలు భయపడతారని, మారుతున్న కాలానుగుణంగా నేడు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమలు చేస్తున్నారని చెపుతూ చిన్నారుల్లో ఉన్న భయాన్ని దూరం చేశారు. ఎక్కడైనా గొడవలు జరిగినా, లేదా అన్యాయం జరుగుతున్నా గానీ గమనించిన విద్యార్థులు 100 నంబర్‌ను డయల్ చేసి పోలీసు కంట్రోల్ రూంకు సమాచారం అందించాలని సీఐలు సూచించారు. ఆయుధాలను ఎలా జాగ్రత్త చేయాలో వివరించారు. అన్యాయాన్ని నియంత్రించడం పోలీసుల పనేనని, వౌనంగా ఉండకుండా ప్రతి పౌరుడు పోలీసుల్లా సమాజానికి ఉపయోగపడాలని చిన్నారులకు సూచించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు వివరణ ఇచ్చారు. పోలీసులు అవసరమైతే విధి నిర్వహణలో ప్రాణత్యాగాలకైనా వెనుకాడరని మూడు పోలీసు స్టేషన్ల సీఐలు కాశీవిశ్వనాథ్, ఎండీ ఉమర్, మోహన్‌రెడ్డి చిన్నారులకు వివరించారు.