విజయవాడ

పుష్కర బందోబస్తుకు పక్కా ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 5: ప్రతిష్ఠాత్మక కృష్ణా పుష్కరాలకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరోవారం రోజుల్లో నగరంలో ప్రారంభం కానున్న పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తకోటి, యాత్రికుల భద్రత, విఐపిల రక్షణ ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళిక సిద్ధమైంది. ట్రాఫిక్ క్రమబద్దీకరణ, బందోబస్తు నిర్వహణకు నగర పోలీసుశాఖ కసరత్తు కొలిక్కి వచ్చింది. బందోబస్తు విధులకు సన్నద్ధమైన పోలీసు యంత్రాంగం మరో రెండు, మూడు రోజుల్లో ట్రైల్న్ నిర్వహించనుంది. యాత్రికులకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా పక్కా భరోసాతో విజయవంతంగా పుష్కరుడిని సాగనంపేందుకు రంగం సిద్ధం చేసింది. నిఘా విషయంలో ఏమాత్రం రాజీ పడని రీతిలో సిసి కెమెరాల ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ట్రాఫిక్ చర్యలు, శాటిలైట్ స్టేషన్లు, పార్కింగ్ ప్రదేశాలు, భద్రతా దళాలు, రెస్క్యూ బృందాలు తదితర వాటికి సంబంధించి ప్రణాళిక రూపొందించినట్లు నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ తెలిపారు. కమిషనరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన పుష్కరాల బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను వివరించారు. గోదావరి పుష్కరాలకు తొలిరోజు 13 నుంచి 14 లక్షల మంది యాత్రికులు తరలివచ్చారని, దీన్ని బట్టి చూస్తే.. కృష్ణాపుష్కరాలకు అంతకన్నా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో 29 పుష్కర స్నాన ఘాట్‌లను గుర్తించి వీటిని సిద్ధం చేశారు. వీటిలో ఏడు ఘాట్‌లను ఏప్లస్ కేటగిరి కింద పరిగణిస్తున్నారు. భక్తులు తమకు నచ్చిన ఏ ఘాట్‌లోనైనా స్నానమాచరించేందుకు వెసులుబాటు కల్పించినట్లు సీపి తెలిపారు. వచ్చే రద్దీని బట్టి ఏ విధమైన అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఎవరికీ ఏవిధమైన ఇబ్బంది కలుగుకుండా వాహనాల రాకపోకలు క్రమబద్దీకరించినట్లు, అదేవిధంగా రూట్‌మ్యాప్ ప్రకారం.. పుష్కరనగర్‌ల నుంచి ఘాట్‌ల వద్దకు లోకల్ ఆర్టీసి బస్సులు మినహా ఏవిధమైన వాహనాలకు అనుమతి లేదన్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే యాత్రికులు శాటిలైట్ బస్టేషన్, శాటిలైట్ రైల్వేస్టేషన్‌లో దిగి, సమీపంలో ఉన్న పుష్కరనగర్‌లో సేదదీరిన మీదట అక్కడి నుంచి లోకల్ బస్సుల్లో ఘాట్‌ల వద్దకు వచ్చేందుకు ఏర్పాటు చేశామన్నారు. దీనిలో భాగంగా ఆరు శాటిలైట్ బస్టేషన్లతోపాటు రాయనపాడు, కొండపల్లి, గుణదల, మధురానగర్, కృష్ణాకెనాల్ తదితర చోట్ల శాటిలైట్ రైల్వేస్టేషన్‌లు ఏర్పాటు చేసినట్లు సీపి వెల్లడించారు.
ఇప్పటి వరకు మొత్తం 19మంది ఐపిఎస్ అధికారులు పుష్కర విధుల్లో పాల్గొనేందుకు సన్నద్ధమైనట్లు సీపి చెప్పారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 14మంది ఎస్పీ క్యాడర్ అధికారులతో కలిసి మొత్తం 17,500 మంది సిబ్బంది పుష్కర విధుల్లో పాల్గొంటున్నారు. ఈనెల 8న మొత్తం బలగాలు రంగంలోకి దిగనున్నాయి. పోలీసు యంత్రాంగానికి సహకారంగా ఏడు వేల మందికి పైగా వలంటీర్లు (విద్యార్థులు-యువత) స్వచ్చంద సేవలందించనున్నట్లు సవాంగ్ చెప్పారు. గోదావరి పుష్కరాల సమయంలో 220 సిసి కెమెరాలు ఏర్పాటు చేయగా.. కృష్ణాపుష్కరాల ప్రాధాన్యత దృష్ట్యా 1400 సిసి కెమెరాలు నిఘా కోసం వినియోగిస్తున్నారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నేరస్తుల కదలికలను పసిగడుతూ ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసే రీతిలో ఇంటిలిజెన్స్ సిసి కెమెరా విధానాన్ని సాంకేతిక పరిఙ్ఞన వినియోగానికి ప్రాధాన్యనిచ్చినట్లు చెప్పారు. ప్రతి ఘాట్‌లో పోలీసు అవుట్‌పోస్టు ఏర్పాటు కానుంది. పున్నమి ఘాట్‌లోనే ఓ భాగం విఐపిలకు కేటాయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విధుల్లో సిద్ధంగా ఉండే ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ప్రతి ఘాట్‌లో పర్యవేక్షిస్తూ ఆపదసమయంలో అప్రమత్తమయ్యేందుకు ఇప్పటికే ఏర్పాటు జరిగాయి. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో 120 పార్కింగ్ ప్రదేశాలు గుర్తించి ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదిలావుండగా.. నిఘా పటిష్ఠ ఏర్పాట్లలో భాగంగా 18 డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నట్లు సీపి చెప్పారు. దశల వారీగా ఈ డ్రోన్ కెమెరాలు గగనతలంలో సంచరిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తాయి. దీనిలో భాగంగా శుక్రవారం బెంజిసర్కిల్ వద్ద ట్రైల్న్ నిర్వహించారు. ప్రధానంగా అకాశంలో ఎగిరే విధంగా బెలూన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ బెలూన్ ద్వారా మల్టీ కెమెరా విధానం అమర్చడం జరుగుతుందని, దీంతోపాటు నిఘా కెమెరాలను దుర్గాఘాట్ వద్ద నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ రూముకు అనుసంధానించడం ద్వారా ఇక్కడి నుంచి మొత్తం పుష్కరాల వ్యవస్థను ముఖ్యమంత్రి, డిజిపి, అన్ని శాఖల ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారని సీపి చెప్పారు. విలేఖరుల సమావేశంలో డిఐజిలు శ్రీకాంత్, పి హరికుమార్, డిసిపిలు జివిజి అశోక్‌కుమార్, పాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.