విజయవాడ

దుమ్మురేపిన కార్పొరేషన్ విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), ఆగస్టు 7 : నగర పాలక సంస్థ, పోలీస్ శాఖ సంయుక్త ఆద్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద ప్రతి నెల మొదటి ఆదివారం నిర్వహిస్తున్న హ్యాపీ సండే కార్యక్రమంలో నగరంలోని కార్పొరేషన్ పాఠశాలల విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని ఉర్రూతలూగించారు. ఆట, పాటలతో తాము డ్యాన్సర్లకు ఏమాత్రం తక్కువ కాదంటూ దుమ్ముదులిపారు. ముందుగా హ్యపీ సండే కార్యక్రమాన్ని మేయర్ కోనేరు శ్రీధర్, శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ జి వీరపాండియన్‌లు పాల్గొని ప్రారంభించి వారు కూడా విద్యార్థులతో కలిసి పలు క్రీడాంశాల్లో పాల్గొన్నారు. కమిషనర్ సతీమణి అండాళ్లు విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడారు. జానపద నృత్యాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన రోప్ స్కిప్పింగ్ ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. సెపక్‌తక్రా, వాలీబాల్, బ్యాట్‌మింటన్, త్రోబాల్, టెన్నికాయిట్, తొక్కుడు బిళ్ల, ఒప్పుల గుప్ప, వంటి పలు క్రీడాంశాల్లో విద్యార్థులతో పాటు నగర ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ఆడిపాడారు. ఈసందర్బంగా మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆనందంగా గడపాలనేది హ్యాపీ సండే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమఅన్నారు. నగర ప్రజలంతా కుటుంబ సమేతంగా సరదాగా ఉల్లాసంగా కొంత సమయం గడపటంలో ఆనందంగా ఉండవచ్చని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్లు నజీర్ హుస్సేన్, చెన్నుపాటి ఉషారాణి, చౌదరి, నగరపాలక అధికారులు, పోలీసు అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.