విజయవాడ

ఆర్యవైశ్యులు ఐకమత్యంతో ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 14: ఆర్యవైశ్యులు ఐకమత్యంతో పని చేయాలని తమిళనాడు మాజీ గవర్నర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సూచించారు. గురువారం నగరంలో జరిగిన వాసవి సన్నిధి భూమి పూజ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సమష్టి కృషి స్ఫూర్తిదాయకమన్నారు. ఆర్య వైశ్య సంఘాలన్నీ ఒక్కటిగా ఉంటేనే ఆర్య వైశ్యులకు గౌరవం మరింత ఇనుమడిస్తుందన్నారు. అదేవిధంగా వాసవీ సన్నిధిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. వాసవీ సత్ర సముదాయం గౌరవ చైర్మన్, రాజ్యసభ సభ్యులు, జాతీయ, రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖ చైర్మన్ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రోశయ్య ఆర్యవైశ్య ఆర్యవైశ్య జాతికే వనె్న తీసుకువచ్చారని కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటివరకు ఎవరికి ఏమాట ఇచ్చినా అది నెరవేర్చారని ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఐదేళ్ల తర్వాత సీఎం జగన్ హయాంలోనే నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరిగిందని గుర్తుచేశారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వచ్చే ఏడాది ఏపిల్ నాటికి ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో నేడు అవినీతి రహిత పాలన కొనసాగుతోందని జగన్ వల్లే సాధ్యపడిందన్నారు. సదస్సులో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ట వీరభద్రస్వామి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్యే మద్దాల గిరి, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు, తదితరులు పాల్గొన్నారు.