విజయవాడ

ప్రభుత్వ భూముల్లోని పేదలకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, నవంబర్ 14: జిల్లాలోని అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో నివాసం ఉంటున్న పేదలు తమ ఇంటి స్థలాన్ని క్రమబద్దీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం జిల్లాలో ఇళ్లస్థలాల పంపిణీ, భూసేకరణపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల 27 వేల మంది పేదలు ఇళ్లస్థలాల కోసం అర్హులుగా గుర్తించటం జరిగిందన్నారు. ఇందుకోసం 4వేల 497 ఎకరాల భూమి అవసరమని, ప్రసుత్తం 2వేల 132 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని తెలిపారు. మిగిలిన ప్రైవేటు భూమిని త్వరితగతిన భూ సేకరణ చేపట్టాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివాసం ఉన్న పేదలు వారి ఇంటి స్థలం క్రమబద్దీకరణ కొరకు తహసీల్దారు లేదా గ్రామ సచివాలయంలో తమ దరఖాస్తు అందించాలన్నారు. దీనికి సంబంధించి నవంబర్ 6నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని, సదరు దరఖాస్తు పరిశీలించి 120 రోజుల్లోగా నిబంధనల మేరకు అర్హత కలిగిన పేదల స్థలాలను రెవెన్యూ అధికారులు క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటారన్నారు. ఈ అవకాశాన్ని పేదలు సద్వినియోగం చేసుకునేలా రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. ప్రభుత్వ భూముల లేఅవుట్లను సంబంధిత సర్వేయర్లు తయారు చేసి రెవెన్యూ డివిజనల్ అధికారులకు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి ఈ నెల 16న అన్ని మండలాల్లోనూ సోషల్ అడిట్ నిర్వహించి లబ్ధిదారుల జాబితాపై చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. దారిద్య్రరేఖకు దిగువున ఉన్న పేదల భూముల్లో నివాసం ఉండేవారు 100 చదరపు గజాలలోపు నివాసం ఉన్నట్లయితే వాటి క్రమబద్దీకరణకు ఒక్క రూపాయి చెల్లించి క్రమబద్దీకరణ చేయించుకోచ్చన్నారు. 100 నుండి 300 చదరపు గజాలలోపు, 300 చదరపు గజాలకు కంటే ఎక్కువ ప్రభుత్వ స్థలంలో నివాసం ఉన్నవారు తమ నివాస స్థలాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్ణయించిన ధరను చెల్లించి తమ స్థలాలను క్రమబద్దీకరించుకోవచ్చన్నారు. ఈ విధంగా జిల్లాలో 100 గజాల లోపు ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్నవారు 581 మంది, 100 నుండి 300 చదరపుగజాల భూములలో నివాసం ఉంటున్నవారు 183 మంది, 300 చదరపుగజాలకంటే ఎక్కువ ప్రభుత్వ స్థలాలో నివాసం ఉంటున్నవారు 32మంది అర్హులుగా గుర్తించటం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, సబ్ కలెక్టర్లు స్వప్నిల్ దినకర్ పుండ్కర్, హెచ్‌ఎం ధ్యానచంద్ర, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు చక్రపాణి, ఆర్‌డీవోలు ఖాజావలి, జీ సత్యవాణి, డీటీ సుభాష్, తదితరులు పాల్గొన్నారు.