విజయవాడ

రౌడీ రాజ్యం పోవాలి.. ప్రజాస్వామ్యం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), నవంబర్ 14: సుదీర్ఘ రాజకీయ అనుభవంలో 14 సంవత్సరాలు సీఎంగా, 10 సంవత్సరాలు ప్రతిపక్షనేతగా, 27సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన తనకు పదవులపై ఏ మాత్రం వ్యామోహం లేనే లేదని తెలుగుదేశం పార్టీ జాతీ య అధ్యక్షుడు, ప్రతిపక్షనేత నారా చం ద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 6నెలలుగా రాష్ట్ర పరిస్థితి, మరీ ము ఖ్యంగా ప్రజల పరిస్థితి దారుణంగా తయారు కావడంతో రాష్ట్రం ఏమైపోతుందోనన్న భయం వెంటాడుతోందన్నారు. సీఎం పదవి చేపట్టిన నాటి నుండి జగన్ అవలంబిస్తున్న విధానాల కారణంగా ఇటు ప్రజలు, అటు పెట్టుబడుదారులు హడలి పోతున్నారన్నారు. అందుకే రోడ్డెక్కి అన్ని సమస్యలపై తానొక్కడినే పోరాటం చేస్తున్నానన్నారు. శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా చలించేది లేదన్నారు. అయితే ఇదే సమయంలో వాస్తవ పరిస్థితిలు తెలిసి కూడా రాష్ట్ర ప్రజలు అయ్యో పాపం, తప్పు అంటున్నారే తప్పా, సమస్యలపై పోరాడేందుకు ముందుకు రాకపోవడం బాధగా ఉందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతకు తక్షణ పరిష్కారం చూపించటంతో పాటు, ఆత్మహత్యలు చేసుకున్న కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలంటూ 12 గంటల పాటు దీక్షను మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని ధర్నా చౌక్‌లో నిర్వహించారు. ఉదయం సరిగ్గా 8 గంటలకు నిరాహార దీక్షను భవన నిర్మాణ కార్మికులు, తెదేపా శ్రేణుల కరతాళ ధ్వనుల మధ్య ప్రారంభించిన చంద్రబాబు సాయంత్రం 8.20 నిమిషాలకు దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పటిష్టంగా, పగడ్బందీగా ఇసుక విధానం తీసుకు వచ్చి, రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఇసుకను సమర్థవంతంగా అందించామన్నారు. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం దేశాన్ని చుట్టుముట్టిన సమయంలో అన్ని ధరలు దిగి వస్తుంటే, కేవలం మద్యం, ఇసుక ధరలు మాత్రం అమాంతం పెరిగాయన్నారు. కేవలం నెల రోజుల్లో మద్యం పాలసీ తీసుకువచ్చిన ప్రభుత్వం ఇసుకపై స్పష్టమైన విధానం ఎందుకు తీసుకు రాలేకపోతున్నదని మండిపడ్డారు. గతంలో ఉచితంగా లభించిన ఇసుకకు ఇప్పుడు ఎందుకు టన్నుకు రూ.375/- కట్టాలో చెప్పాలన్నారు. అప్పటి ప్రభుత్వం కన్నా మీరు మెరుగైన పాలసీ ఏమైనా తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. స్పష్టమైన విధానం తీసుకు రాని ప్రభుత్వానికి ఇసుక రీచ్‌ల వద్ద పెత్తనం ఎందుకని ప్రశ్నించారు. కార్మకులు ఆత్మహత్యలు చేసుకుంటే బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం తగదన్నారు. అదే మీ కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్య చేసుకుని చనిపోయినా ఇలానే మాట్లాడతారా అంటూ మంత్రులను ప్రశ్నించారు. తనపై వ్యక్తిగత కక్షతో పేదల ప్రాణాలతో చెలగాటం ఆడటం తగదన్నారు. మద్యంపై జే ట్యాక్స్ ఖరారయినందునే అధికధరకు మద్యాన్ని అధికారులతో అమ్మిస్తున్నారని విమర్శించారు. మద్యం సేవించే ప్రతీ వ్యిక్తి సీఎం జగన్‌ను తిట్టుకుంటున్నారని తెలిపారు. సిమెంటు కంపెనీల నుండి జే ట్యాక్స్ వసూలు చేసినందునే కంపెనీలు నెల రోజుల్లోనే ధరను ఒక్కసారిగగా రూ.110/- పెంచాయన్నారు. అధికారంలోనికి వచ్చే ముందు నుండే దోపిడీకి ప్రణాళిక రచించిన జగన్ అందుకు అనుగుణంగా ఇప్పుడు అందరినీ నిలువునా దోచుకుంటున్నారన్నారు.