విజయవాడ

కృష్ణా పుష్కరాలకు 98 శాతం ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 7: పుష్కరాలకు సంబంధించి అన్ని పనులు దాదాపు పూర్తయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. ఆదివారం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన పుష్కర ఘాట్లను పరిశీలించారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం సంగమం ఘాట్ నుండి పర్యటన ప్రారంభించిన మంత్రులు పిడబ్ల్యుడి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన టిటిడి నమూనా దేవాలయాలను పరిశీలించడం వరకు 3 గంటల సుదీర్ఘ పర్యటన సాగింది. ముందుగా సంగమం ఘాట్ వద్దకు వెళ్లిన మంత్రుల బృందం అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ఆధ్వర్యంలో కృష్ణా హారతికి చేస్తున్న ఏర్పాట్లను దర్శకులు బోయపాటి మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పనులు జరుగుతున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో పనులు పూర్తవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కృష్ణా తీరం వెంబడి జరుగుతున్న పనులు కేవలం పుష్కరాలను ఉద్దేశించి చేస్తున్న తాత్కాలిక ఏర్పాట్లుగా భావించవద్దని, రివర్ ఫ్రంట్ రాజధాని కోసం కృష్ణాతీరాన్ని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పరుస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే మొత్తం పుష్కరాలకు 8 ప్రధాన ఘాట్లు, 30 సబ్ ఘాట్లు ఏర్పాటు చేశామని, 3వేల మంది మున్సిపల్ సిబ్బంది, 20వేల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది పుష్కర విధుల్లో నిమగ్నమవుతున్నారని అన్నారు. ముఖ్యంగా శానిటేషన్ ప్రథమ ప్రాధ్యాన్య అంశంగా ప్రభుత్వం భావిస్తోందని, ఇందుకోసం గత గోదావరి పుష్కరాల్లో అద్భుతంగా శానిటేషన్ నిర్వహించిన అనుభవం ఉపయోగపడనుందని అన్నారు. ఇంకా 21 పుష్కర నగర్‌లు ఏర్పాటు చేస్తున్నామని, 26 చోట్ల వాహనాల పార్కింగ్ కోసం స్థలం కేటాయించామని, 2500 తాత్కాలిక మరుగుదొడ్లను నిర్మించామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో 3వేల బస్సులు నడుపుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. పూర్తిగా రూ. 20కోట్లతో డ్రోన్ కెమెరాలు, సిసి కెమెరాల నడుమ భక్తులకు పూర్తి స్థాయి భద్రతను కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. 74 ప్రాంతాల్లో రోజుకు 7.5 లక్షల మందికి భోజన సదుపాయం కల్పించామని, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మొత్తం 3.5 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పిన నారాయణ వీరందరిని ఎప్పుడు ఏ ఘట్‌కు పంపాలో, ఏ ఘాట్‌లో ఎంత రద్దీ ఉందో తెలిపేలా ఒక సంఘటిత వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.