విజయవాడ

పుష్కర ఘాట్ల వద్ద కూచిపూడి నృత్య ప్రదర్శనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, ఆగస్టు 9: ప్రేక్షకుల కరతాళ ధ్వనులే మనులు, మాణిక్యాలుగా భావించే కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. ఈ నెల 12 నుండి 23 వరకు జరిగే కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత కూచిపూడి నాట్యాన్ని ప్రముఖ పుష్కర ఘాట్లలో ప్రదర్శింప చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సాంస్కృతిక శాఖకు ఈ బాధ్యతను అప్పగించింది. పర్యవేక్షకులుగా కూచిపూడి నాట్యారామం కమిటీ చైర్మన్ కూచిభొట్ల ఆనంద్‌ను నియమించారు. దీంతో కళాకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని కృష్ణా, గోదావరి సంగమ ప్రాంతమైన ఫెర్రి వద్ద, విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం, అవనిగడ్డ, తదితర ప్రాంతాల్లో నాట్య ప్రదర్శనలు జరపాలంటూ సాంస్కృతిక శాఖాధికారులు ప్రముఖ కూచిపూడి కళాకారులను కోరారు. వీరిలో బిస్మిల్లాఖాన్ యువ పురస్కార్ అవార్డు గ్రహీతలైన డా. చింతా రవి బాలకృష్ణ, డా. ఏలేశ్వరపు శ్రీనివాస్, వేదాంతం వెంకటాచలపతి, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు వేదాంతం రాధేశ్యాం, డా. వేదాంతం రామలింగశాస్ర్తీ, డా. పసుమర్తి రామలింగశాస్ర్తీ, అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్, వెంపటి రవిశంకర్, విశాఖపట్నంకు చెందిన ఎబి బాలకొండలరావు, ఆదిత్య బుల్లి బ్రహ్మం బృందాలకు అవకాశం కల్పించారు. ప్రదర్శనకు సమయం కేటాయింపుపై మంగళవారం వరకు స్పష్టత ఇవ్వకపోవటంతో కళాకారులు ఆందోళన చెందుతున్నారు. కూచిపూడి నాట్యంలోని యక్షగానాలు, కలాపాలు, నృత్య నాటికలు కళాకారుల ప్రావీణ్యతను వెలుగులోకి తెస్తాయి. ఒక్కో ప్రదర్శనకు గంటన్నర వ్యవధి అత్యంత స్వల్పం. అయితే సాంస్కృతిక శాఖ ప్రదర్శనకు అవసరమైన సమయాన్ని తేల్చిచెప్పకపోవటంతో చివరకు వ్యస్థ నృత్యాలు, బృంద నృత్యాలకే సమయం పరిమితమైతే తమ ప్రావీణ్యతను ప్రదర్శించేందుకు అవకాశం కొరవడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రదర్శనలు చేయించామని చేతులు దులుపుకోవడం కాకుండగా తమ ప్రతిభను ప్రదర్శించేందుకు తగిన సమయాన్ని కేటాయించాలని కళాకారులు కోరుతున్నారు.