విజయవాడ

ప్రజలకు ఎప్పటికప్పుడు నేరుగా సమాచారం : సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 11: కృష్ణా పుష్కరాలకు సంబంధించి పూర్తి సమాచారం, సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం మధ్యాహ్నాం పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి పలు ప్రాంతాలు పర్యిటించి దుర్గగుడి వద్ద మోడల్ గెస్ట్‌హౌస్‌ను ఏర్పాటు చేసిన కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్‌ను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కర ఏర్పాట్లు సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడం జరుగుతుందని అలాగే ప్రజల వద్ద నుంచి ప్రజా స్పందన సేకరించేవిధంగా యాప్‌ను రూపొందించామని తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆర్టీసి, పోలీసు ఇతర శాఖలు చేసిన ఏర్పాట్లును అక్కడే ఉన్న పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్‌ను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కలెక్టర్‌కు సూచనలు చేస్తూ దుర్గాఘాట్ వద్ద పూర్తి స్ధాయిలో గ్రానెట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టి పూర్తి చేయాలని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు 24/7 ఈకంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ పని చేస్తుందని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, పత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, నారాయణ, ఎంపి కేశినేని నాని, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, ఎమ్మెల్యేలు బొండా ఉమా, జలీల్‌ఖాన్, పుష్కర స్పెషల్ ఆఫీసర్ బి రాజశేఖర్, సమాచార శాఖ కమిషనర్ ఎస్ వెంకటేశ్వర్లు, కంట్రోల్ సెంటర్ ఇన్‌ఛార్జి జెసి-2 ఎంహెచ్ షరీఫ్, పలు అధికారులు పాల్గొన్నారు.