విజయవాడ

రాష్ట్రంలో ఒక్క ఎకరానూ ఎండనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, ఆగస్టు 16: రాష్ట్రంలో కొన్ని రోజులుగా వర్షాలు కురవకపోవటం వల్ల కొన్ని ప్రాంతాల్లో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా అన్ని పంటలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై వుందన్నారు. ప్రస్తుతం అన్ని కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. మంగళవారం ఆయన కమాండ్ కంట్రోల్ రూంలో వ్యవసాయ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్టవ్య్రాప్తంగా పంటలను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. నాగార్జునసాగర్ నుండి వెంటనే నీటిని విడుదల చేసి కుడికాల్వ ఆయకట్టు పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు అందించాలన్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో కంట్రోల్ రూంలు ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి రైతులకు రెయిన్ గన్‌లు ఇచ్చామని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చైతన్యపర్చాల్సిన బాధ్యత అధికారులపై వుందన్నారు. వర్షం పడినా, పడకపోయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నీటి వనరులు లేని డ్రై ల్యాండ్స్‌లో పంట కుంటలను తప్పనిసరి చేసి రైతులంతా వాటిని ఏర్పాటు చేసుకునేలా చైతన్యపర్చాలన్నారు. రైతులను ప్రోత్సహించటంతో పాటు వ్యవసాయ కళాశాలల విద్యార్థులను ఇందుకోసం పూర్తిస్థాయిలో వినియోగించుకోవటం ద్వారా వ్యవసాయ శాఖ కార్యక్రమాలు మరింత విజయవంతమయ్యే అవకాశం లభిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయకుమార్, ముఖ్యమంత్రి కార్యదర్శి రాజవౌళి, వ్యవసాయ శాఖ సంచాలకులు ధనుంజయరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.