కృష్ణ

జనం, జలమే నా బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం/ మైలవరం, ఆగస్టు 16: వ్యవసాయంతోపాటు దాని అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా రాష్ట్రంలోని వీటిపై ఆధారపడి జీవించే 60 లక్షల కుటుంబాల సంక్షేమానికి కృషి చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కృష్ణా పుష్కరాలలో భాగంగా ఐదవ రోజైన మంగళవారం ఇబ్రహీంపట్నం సంగమం ఘాట్ వద్ద కృష్ణమ్మకు హారతినిచ్చే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరైన అనంతరం ప్రసంగించారు. గత ఏడాది గోదావరి పుష్కరాల సందర్భంగా తాను నదుల అనుసంధానంపై సంకల్పం చేశానని, ఏడాది తిరగకుండానే గోదావరి నదిని కృష్ణానదిలో కలిపి చరిత్ర సృష్టించామన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ రెంటికీ పెన్నానదిని కలిపి రాయలసీమను రతనాలసీమగా మారుస్తానన్నారు. జనం, జలమే నాకు బలమని, ఈ సహకారం ఉంటే తాను ఏదైనా చేస్తానన్నారు. కృష్ణా, గోదావరి నదులు రెండూ నాకు రెండు కళ్ళు అన్నారు. అధునాతన టక్నాలజీతో రాష్ట్రాన్ని అగ్రగామిగా తయారు చేస్తానని ప్రకటించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రాత్రి, పగలు కష్టపడుతున్నానని, మీరు కూడా తనకు సహకరించాలని అందరు అందుకు సంకల్పించాలన్నారు. వ్యవసాయ రంగంపై ఏటా వృద్ధిరేటు 31,400కోట్లు కాగా ఉద్యానవన శాఖ ద్వారా 41,400 కోట్లు, పాడి పరిశ్రమపై 49వేల కోట్లు, చేపల పెంపకంపై 39వేల కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారని వారికి చేయూతనిస్తానని హామీ ఇచ్చారు. ఈరంగాలపై ఆధారపడి దాదాపు 60లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయని వీరికి నెలకు 10వేల ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికను రూపొందించి అమలు చేస్తామన్నారు. ఒంగోలు, పుంగనూరు జాతి పశుసంపదను అభివృద్ధి చేసి పాడి పరిశ్రమకు పూర్వవైభవాన్ని తెస్తానని ఆయన ప్రకటించారు. రైతులకు అవసరమైన దాణాను 50శాతం సబ్సీడీపై అందించి పాలను ఇంటికే వచ్చి కొనుగోలు చేయిస్తానన్నారు. అదేవిధంగా చేపల పెంపకాన్ని అభివృద్ధి చేయిస్తామన్నారు. ప్రస్తుతం 30వేల కోట్ల రూపాయల ఆదాయం చేపల పెంపకంపై వస్తుందని ఎగుమతుల స్థాయిని పెంచితే ఇంకా ఆదాయం పెరుగుతుందన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నీతివంతమైన పాలన అందిస్తూ అగ్రగామి రాష్ట్రంగా ఏపిని తీర్చిదిద్దుతానన్నారు. విభజనతో రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని, వాటికి భయపడకుండా అన్నింటినీ అధిగమిస్తూ సంకల్పబలంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. తనపై నమ్మకముంచితే కుటుంబానికి పెద్ద కొడుకుగా సేవలందించి రాష్ట్భ్రావృద్ధికి పాటుపడతానని ఆయన హామీ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన పాడి పరిశ్రమ అభివృద్ధిపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.