విజయవాడ

సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, ఆగస్టు 18: ఆధ్యాత్మిక, సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు భారతదేశమని, ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, సద్గురు పూజ్య రవిశంకర్ గురూజీ పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడ వచ్చిన గురూజీ గురువారం ఉదయం విజయవాడలోని బృందావన్ కాలనీ ఎ కనె్వషన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ధ్యాన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా గురూజీ మాట్లాడుతూ మాత, పిత, గురువులను ప్రేమించాలన్నారు. సమాజంలో పురుషులు, స్ర్తిలు సమానమేనని గ్రహించాలని స్పష్టం చేశారు. చైతన్యం వికసించాలంటే ధ్యానంతోనే సాధ్యమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధితోపాటు, సంతోషకరమైన సమాజం తయారుకావటానికి సహాయం అందించాలని తనను కోరారని, అందుకు సహాయ, సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చానని తెలిపారు. ధ్యానంతో బాధలు తొలగిపోతాయని అన్నారు. బాధలున్నవారు వాటిని వదిలేస్తే, తన బాధలుగా సంతోషంగా స్వీకరిస్తానని చెప్పారు. ధ్యానం చేస్తే ఆత్మ బలం లభిస్తుందన్నారు. ధ్యానంతో జ్ఞాన బలం సిద్ధిస్తుందన్నారు. మానవ శరీరం దేవుడిచ్చిన అద్భుత ఉపకరణమని, ఈ శరీరం మనిది కాదు భగవంతుడిది అన్న వాస్తవం గ్రహించాలని సూచించారు. అనందకరమైన సమాజం కోసం మనందరం పాటుబడాలని అన్నారు. అంతకుముందు గురూజీ ధ్యానం చేస్తూ భక్తుల చేత కూడా 10 నిమిషాలు ధ్యానం చేయించారు. విజయవాడలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధాన్య మందిరం నిర్మించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.పి. గోకరాజు గంగరాజు, మాజీ మేయర్ జంధ్యాల శంకర్, పారిశ్రామికవేత్తలు, నగర ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.