విజయవాడ

దుర్గమ్మ దేవస్థానానికి ట్రస్ట్‌బోర్డు నియమాకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 20: రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కోరినట్లే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి ట్రస్ట్‌బోర్డును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. కొంత కాలంగా దుర్గగుడి చైర్మన్‌గా పైలా సోమినాయుడు నిమమాకం అంటూ వైకాపాలో చర్చలు నడిచాయ. ప్రారంభంలోనే నగరంలోని ఒక సామాజికవర్గం పైలాసోమినాయుడుకి దుర్గగుడి చైర్మన్ పదవి ఇవ్వరాదని తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ఈవ్యవహారం ఒక కొలిక్కి వచ్చేందుకు కొంత వ్యవధి పట్టింది. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులకు నామినేటెడ్ పదవులను కేటాయించి వారిని గౌరవించటం జరుగుతోందని అధిష్టానం ప్రారంభంలో స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి వైకాపాలోకి వచ్చిన పైలా సోమినాయుడుకి వైకాపా తొలుత నేడు దుర్గగుడి ధర్మకర్త పదవి కేటాయించి కొద్ది రోజుల్లో చైర్మన్ పదవిని సైతం ఇచ్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో చెప్పినట్లే నామినేటేడ్ బోర్డులో ఏకంగా 8మంది మహిళలకు స్థానం కల్పించి మహిళలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. ఆర్డినెన్స్ ద్వారా ధర్మకర్తలు తొలుత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత చైర్మన్‌ను ఎన్నుకుంటారు. చైర్మన్‌గా పైలాసోమినాయుడు ఎన్నిక లాంఛనమేనని పార్టీ వర్గాలు తెలిపాయి. దాదాపుగా తొలి సమావేశంలోనే పైలాను చైర్మన్‌గా ధర్మకర్తలు ఎన్నుకునేలా ఇప్పటికే అధిష్టానం
ధర్మకర్తలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దేవదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సూచినట్లే పైలా చైర్మన్‌గా ఎంపిక జరిగినప్పటికీ మంత్రి సామాజిక వర్గానికి చెందిన వారిలో అధిక శాతం చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అంశాన్ని అధిష్టానం ఏమేరకు స్పందిందో వేచి చూడాలి. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం దుర్గగుడి ట్రస్ట్ బోర్డు నియమాకం ఆర్డినెన్స్ జారీ చేసిన వెంటనే పైలా సోమినాయుడు కుటుంబ సమేతంగా తన ముఖ్య అనుచరుడు శివాలయం కమిటీ మాజీ చైర్మన్ తంగెళ్ల రామును వెంటబెట్టుకొని ఇంద్రకీలాద్రికి వచ్చి దుర్గమ్మను దర్శనం చేసుకున్నారు. వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం వీరికి అర్చకులు దివ్య ఆశీస్సులిచ్చి ప్రత్యేక ప్రసాదాలను అందచేశారు.