విజయవాడ

కాంతులీనుతున్న శైవ క్షేత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 20: మహాశివరాత్రి పర్వదినాన్ని జిల్లాలోని అన్ని శైవ పీఠాలు ముస్తాబయ్యాయి. ప్రత్యేకంగా కృష్ణాతీరం వెంబడి ఉన్న శైవ క్షేత్రాల్లో ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. దేవదాయశాఖ ఏసీ సత్యనారాయణ ఇప్పటికే సుమారు 10 ఆలయాలను తనిఖీ చేసి ఈవోలకు కొని సూచనలు చేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులను దుర్గా ఘాట్‌లోకి అధికారులను అనుమతించటంతో ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను సైతం తాత్కాలికంగా నిలిపేశారు. ఈమేరకు గురువారం ఉదయం వివిధ శాఖలకు చెందిన అధికారులు దుర్గా ఘాట్‌కు వచ్చి దేవస్థానం ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. రాజకీయాలకు కేంద్ర బిందువు ఉన్న నగరంలోని యనమలకుదురు శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థానం ఈవో జీ గంగాధర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఆలయం, కొండ పరిసర ప్రాంతాల్లో రంగు రంగు విద్యుత్ లైట్లు ఏర్పాట్లు చేయటంతోపాటు ప్రత్యేక క్యూమార్గాలను ఏర్పాట్లు చేశారు. అలాగే శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో సిరవరపు హేమలతాదేవి ఆధ్వర్యంలో సిబ్బంది ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. పరిసరాలు మొత్తం విద్యుత్ లైట్లతో ఏర్పాటు చేశారు. ఆలయం నుండి కెనాల్‌రోడ్ వరకు ప్రత్యేక క్యూమార్గాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి 11గంటల నుండి స్వామి లింగ్భోసమయంలో ప్రత్యేక అభిషేకాలు, కల్యాణ మహోత్సవం, వేద పఠనం నిర్వహించేలా ఈవో హేమలతాదేవి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఉదయం 8గంటల నుండి 10గంటల వరకు 3 రకాలైన ప్రత్యేక ప్రసాదాలు, ఉదయం 11గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు వచ్చిన భక్తులకు అందరికీ భోజన సదుపాయం ఏర్పాట్లు చేశారు. అలాగే శ్రీ విజయేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ వసంత మల్లిఖార్జునస్వామి దేవస్థానం, శ్రీ ధర్భేశ్వర శివాలయం, శ్రీకాశీ అన్నపూర్ణ దేవి శివాలయం, సత్యనారాయణ పురం శివాలయం, కృష్ణలంక శివాలయం, భవానీపురం శివాలయం, కౌతావారి శివాలయాలు మహాశివరాత్రి మహోత్సవాలకు సిద్ధం అయ్యాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసంవత్సరం కూడా శుక్రవారం ఉదయం శ్రీ దినవాహివారి సత్రం ఈవో గెల్లి హరిగోపినాధ్‌బాబు ఆధ్వర్యంలో సత్రం వ్యవస్థాపకులు పూజలు నిర్వహించి అనంతరం 9గంటల నుండి సుమారు 5వేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని శైవపీఠాలు మహాశివరాత్రి మహోత్సవాలు సిద్ధం అయ్యాయి.