విజయవాడ

పేదల ఇళ్ల కోసం రెండ్రోజుల్లో లే అవుట్ పనులు పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 27: పేదల ఇంటిస్థలాల కోసం లే అవుట్‌ల అభివృద్ధి పనులు ఈనెల 29లోగా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ సంబంధి త మండల అధికారులను ఆదేశించా రు. క్యాంపు కార్యాలయం నుంచి గు రువారం సాయంత్రం ఇంటి స్థలాల భూసేకరణ లే అవుట్‌ల ప్రగతి తీరు ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ జిల్లాలో పేదలకు ఇళ్లస్థలా లు అందించేందుకు అందుబాటులో ప్రభుత్వ భూముల్లో చేపట్టిన 1042 లే అవుట్‌ల అభివృద్ధి పనుల ప్రగతిని మండల వారీ సమీక్షిస్తూ ఈ పనులను రానున్న రెండు రోజుల్లో శరవేగంగా పూర్తి చేయాలన్నారు. ఈవిషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్ట్భాముల సేకరణలో రైతులకు న చ్చ చెప్పి అవసరమైన తదుపరి చర్య లు తీసుకోవాలన్నారు. ఈ విషయం లో సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, జిల్లా రెవెన్యూ అధికారి ఏ ప్రసాద్, సబ్ కలెక్టర్ ధ్యానచంద్ర, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, ట్రైనీ కలెక్టర్ అంజలీ అనుపమ, జడ్‌పీసీఈఈఓ సూర్యప్రకాశరావు, డ్వామ పీడీ జీవీ సూర్యనారాయణ, హౌసింగ్ పీడీ ధనుంజయుడు, టిడ్కో పీడీ చిన్నోడు పాల్గొన్నారు.