విశాఖపట్నం

మార్చి నెలాఖరుకల్లా కనకదుర్గా ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 16: కనకదుర్గ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ తుదిమెరుగుల పనులు మార్చి నెలఖారుకల్లా పూర్తి చేయాలని సంబంధిత ఎన్‌హెచ్ అధికారులు, నిర్మాణ సంస్థ సోమా ప్రాజెక్ట్ ప్రతినిధులను కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఆదేశించారు. స్థానిక భవానీపురం, కృష్ణవేణి ఘాట్‌వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులను సోమవారం కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ సంబంధిత ఎన్‌హెచ్ అధికారులు, నిర్మణ సంస్థ సోమా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో కనకదుర్గ ప్లైఓవర్ బ్రిడ్జి పనుల్లో ఇంతవరకు 90శాతం నిర్మాణ పనులు పూర్తిచేశారని మిగిలిన పనులు మార్చి నెలఖారుకల్లా వేగవంతంగా పూర్తిచేసేలా జాతీయ రహదారుల అధికారులు, సోమా సంస్థ ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా కనకదుర్గ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఇంతవరకు పూర్తిచేసిన పనులను కలెక్టర్ పరిశీలించారు. ఇంతవరకు 2.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనుల్లో ఇంతవరకు 1.5 కిలోమీటర్లు పూర్తి చేశారన్నారు. క్రాస్‌బేర్స్ నిర్మాణ పనులు చరుకుగా పూర్తి చేయాలన్నారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తి అవుతున్న దృష్ట్యా ఆ రోడ్డులో ట్రయల్ రన్ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సోమా సంస్థ ప్రాజెక్టు మేనేజర్ అనంతరాములు మాట్లాడుతూ ఏప్రిల్ 15కల్లా కనకదుర్గ ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు తుది రూపానికి తీసుకువస్తామన్నారు. కలెక్టర్ వెంట జాతీయ రహదారుల ఎస్‌ఇ జాన్‌మోషే, సోమా సంస్థ ప్రాజెక్టు మేనేజర్ అనంతరాములు,తదితరులు పాల్గొన్నారు.

*