విజయవాడ

‘జనతా కర్ఫ్యూ’ సంపూర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, మార్చి 22: కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించాలని స్వయంగా భారత ప్రధాని జనతా కర్ఫ్యూకి ఇచ్చిన పిలుపుమేరకు ప్రజలు విజయవంతం చేశారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి సహకరించారు. ప్రముఖ వ్యాపార స్థావరాలు సైతం మూతబడ్డాయి. రాజకీయ అలజడులు ప్రతిపక్షాలు నిర్వహించే భారత్ బంద్‌లు సైతం గతంలో అసంపూర్తిగా జరిగాయి. కరోనాని నియంత్రించాలని భారతీయుల్లో, రాష్ట్ర ప్రజల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలంతా ప్రధాని పిలుపు మేరకు జనతా కర్ఫ్యూని పాటించారు. అధికార, ప్రతిపక్షాలు, రాజకీయాలకు అతీతంగా భారతీయుల భవిత, ప్రాణరక్షణ కోసం అందరూ భాగస్వాములయ్యారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే విజయవాడ - హైదరాబాద్ 64వ నంబర్ జాతీయ రహదారిపై ఒక్క వాహనం కూడా కన్పించలేదు. విద్యాధరపురం, కుమ్మరిపాలెం సెంటర్‌లో రోడ్లలో ఎలాంటి వాహనాలు తిరగలేదు. ఆ ప్రాంతంలోని షాపులన్నీ మూతబడ్డాయి. కనకదుర్గమ్మ ఆలయం ఘాట్ రోడ్డు పూర్తిగా మూసేశారు. కనకదుర్గా స్నానఘాట్ వద్ద పూజాద్రవ్యాలు పూలు, టెంకాయలు అమ్ముకునే చిరు వ్యాపారుల జాడేలేదు. ప్రకాశం బ్యారేజీపై ఎలాంటి వాహనాలూ తిరగకుండా వెలవెలబోయింది. రథం సెంటర్, కెనాల్ రోడ్డు, పాతబస్తీలోని మెయిన్‌బజారు, వస్తల్రత, శివాలయం వీధి తదితర ప్రాంతాల్లో వ్యాపారాలు స్తంభించాయి. వస్తల్రత, పంజా సెంటర్‌లోని కృష్ణవేణి క్లాత్ మర్చంట్స్‌ని ఈ నెల 31 వరకు మూసేయాలని మున్సిపల్ అధికారులు ఆదేశాల మేరకు పశ్చిమంలో ప్రధాన వ్యాపార కూడళ్ల మూతపడ్డాయి. విద్యాధరపురంలోని ఆర్టీసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రధాన ద్వారానికి గేట్లు వేసి తాళాలు బిగించారు. బాబూరాజేంద్ర ప్రసాద్ రోడ్డు, గణపతిరావు రోడ్డు, కేటీ రోడ్డులో కొత్తపేట నెహ్రూబొమ్మ సెంటర్ నుండి చిట్టినగర్, మిల్క్ఫ్యాక్టరీ వరకు అన్ని రకాల దుకాణాలు మూతపడ్డాయి. పుచ్చకాయలు అమ్ముకునే తోపుడు బండ్ల వ్యాపారులు సైతం స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూని పాటించారు. రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి కర్ఫ్యూ ఎన్నడూ చూడలేదని స్థానికులు తెలిపారు. ఆదివారం ఉదయం నుండి రాత్రి వరకు కరోనా నియంత్రణ కోసం కఠోర బంద్‌ని పాటించారు. రైతుబజారులు సైతం మూతబడ్డాయి.