విజయవాడ

లోటు బడ్జెట్ ఉన్నా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 2: రాష్ట్రంలో విభజన అనంతరం లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ప్రజల ఆకాంక్ష మేరకు అన్నింటిని అధిగమిస్తూ, సుపరిపాలన అందిస్తున్నట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించనప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అనుసరించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్నింటిలోనూ అగ్రగామిగా నిలుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రుల రాజధాని అమరావతి నుండి పరిపాలన ప్రారంభించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం మేరకు అమరవాతిలోని వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో నాల్గవ బ్లాక్‌లోని మొదటి అంతస్తులో తమ శాఖ కార్యాలయాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆయన కార్యాలయాన్ని ప్రారంభించారు. సర్వమత ప్రార్థనలు జరిగాయి. కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ కష్టాలన్నిటినీ ఎదుర్కొంటూ ప్రజల కోసం పనిచేయడం తమకు ఆనందాన్ని ఇస్తోందన్నారు. రాష్ట్రాన్ని 2029 నాటికి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. అనంతరపురంలోని 6 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటను కాపాడడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న చొరవ, నిర్ణయాలు ఆ ప్రాంత రైతాంగం ఎప్పటికీ మరువలేరన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం మోహరించి నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. వేరుశనగ పంటను కాపాడేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ సమన్వయం చేసుకుంటూ పంటను కాపాడి రైతుల మన్నలు పొందారని చెప్పారు. కష్ట సమయంలో ప్రభుత్వం తమకు అండగా ఉంటుందని భరోసా కల్పించారని, ప్రభుత్వంపై రైతులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ కమిషనర్ ఎస్ వెంకటేశ్వరరావు, సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ డి విజయభాస్కర్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి పి ఉషారాణి, మైనారిటీ కమిషనర్ మహ్మద్ ఇక్బాల్‌తో పాటు పలువురు సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.