విజయవాడ

గురువులు నిత్య విద్యార్థులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, సెప్టెంబర్ 4: సమాజంలో ఎదురయ్యే ప్రతి వ్యక్తి, ప్రతి జీవి, ప్రకృతి కూడా గురువులేనని వారి నుండి నేర్చుకోవలసిన అంశాలు అనేకం ఉన్నాయని విజయవాడ సబ్‌కల్టెర్ డాక్టర్ జి.సృజన అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం పటమట త్రివేణి బాలుర క్యాంపస్, దర్శిపేట రాజరాజేశ్వరి కల్యాణమండంపం, త్రివేణి మహిళా కళాశాల, ఎస్‌విఎస్ కల్యాణ మండంపంలో త్రివేణి విద్యా సంస్థల ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్‌విఎస్ కల్యాణ మండపంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకులకు అమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ గురువుల నుండి పాఠ్యాంశాలు నేర్చుకుంటే సమాజం నుండి ఎలా బ్రతకాలో నేర్చుకుంటామన్నారు. విద్యాతోనే సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు. అంతకుముందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి సబ్‌కల్టెర్ సృజన, ప్రిన్సిపాల్, డైరెక్టర్ బి.సీతారామిరెడ్డి, వి.సాంరెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సబ్‌కల్టెర్ సృజనను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.