విజయవాడ

జూన్ 30 లోపు విమానాశ్రయం పనులు పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 12: గన్నవరం విమానాశ్రయం పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ బాబు ఎ ఆదేశించారు. స్థానిక గన్నవరం విమానాశ్రయాన్ని అక్కడ జరుగుతున్న పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో తొలిసారిగా పెద్ద పుష్కర వేడుక నిర్వహించుకుంటున్నామన్నారు. పుష్కరాలకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుండి పుణ్యస్నానాలు ఆచరించడానికి యాత్రికులు రావడం జరుగుతుందన్నారు. అందుకు అనుగుణంగా జూన్ 30 నాటికి పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు.