విజయవాడ

హోదాపై మోసం.. దగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 8: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం పచ్చి మోసం, దగా చేసిందని ప్రత్యేక హోదా సాధన సమితి, వామపక్ష, వైసిపి, ప్రజాసంఘాల నేతలు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీల సాధన కోసం ఉద్యమాలను తీవ్రతరం చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించడం కోసం ఈ నెల 10న రాష్టవ్య్రాప్తంగా బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాష్టవ్య్రాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలు, ముట్టడి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ఉదయం విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని ఆకాశవాణి కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నా జరిగింది. ధర్నాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం సిపిఐ, సిపిఎం నగర కార్యదర్శులు దోనేపూడి శంకర్, దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక, విభజన హామీల అమలు కోరుతూ రాష్టవ్య్రాప్తంగా 13 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట బిజెపి, టిడిపి మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు పెద్దఎత్తున ధర్నాలు, ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు మాట్లాడుతూ జైట్లీ చేసిన ప్రకటనలో ఏమాత్రం కొత్తదనం లేదన్నారు. ఒక్క పోలవరానికి నిధులు ఇస్తామన్న మాటతప్ప కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, అనంతపురం యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ, విశాఖలో రైల్వే జోన్ విషయంలో గానీ ఏమాత్రం స్పష్టత లేదన్నారు. వైసిపి జిల్లా, నగర అధ్యక్షులు మాజీ మంత్రి కె పార్థసారధి, వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర విభజన, హామీల అమలు విషయంలో చంద్రబాబు మొదటి నుండి మోసపూరితంగా, ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు, మోదీ టక్కుటమార విద్యలు మానుకొని చట్టబద్ధతతో కూడిన హోదా, ప్యాకేజీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిసి జనసభ వ్యవస్థాపక అధ్యక్షులు డా. జి గంగాధర్ మాట్లాడుతూ బిజెపి, టిడిపి కలిసి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాయని విమర్శించారు. సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కె పోలారి, సాధన సమితి ఉపాధ్యక్షులు డా. శర్మ, మాలమహానాడు రాష్ట్ర నాయకులు బండి బాలయోగి, సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబూరావు, నగర కార్యదర్శి కాశీనాథ్ ప్రసంగించారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు పెద్దసంఖ్యలో పాల్గొని నిరసన తెలిపాయి.